మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి | CM Revanth Reddy Review Meeting On Bhadrachalam Temple | Sakshi
Sakshi News home page

మూడు దశల్లో ‘భద్రాద్రి’ పునరాభివృద్ధి

Mar 22 2026 4:34 AM | Updated on Mar 22 2026 4:34 AM

CM Revanth Reddy Review Meeting On Bhadrachalam Temple

భద్రాచల దేవాలయ పునరాభివృద్ధి పనులపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖ, ఎంపీ వేం నరేందర్‌రెడ్డి, సీఎస్‌ రామకృష్ణారావు

గోదావరి పుష్కరాల నాటికి మొదటి దశ పూర్తి కావాలి 

సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ పునరాభివృద్ధిని మూడు దశల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల నాటికి తొలి విడత పనులు పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేయాలని చెప్పారు. తొలి దశ పనులు వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. శనివారం రాత్రి ఆయన ఆలయ పునరాభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కొండా సురేఖ, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, బలరాం నాయక్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కమిషనర్‌ హన్మంతరావు తదితరులతో సమీక్షించారు.

పుష్కరాల నాటికి మొదటి దశ పనులు పూర్తిచేసి, పుష్కరాల అనంతరం మిగతా పనులు జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పుష్కరాల కోసం గోదావరి తీరంలో భక్తులకు వసతి కల్పించాలన్నారు. భక్తుల దర్శనాలు కొనసాగుతుండగానే ఆలయ అభివృద్ధి పనులు జరపనున్నందున, భక్తులకు ఇబ్బంది కలగకుండా పనులు జరగాలని చెప్పారు. ఆలయ సహజత్వానికి భంగం కలగకుండా ఆగమశాస్త్రబద్ధంగా పునరాభివృద్ధి ఉండాలని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement