రేపు హాలియాలో సీఎం కేసీఆర్‌ పర్యటన | CM KCR To Visit Halia On August 2nd | Sakshi
Sakshi News home page

రేపు హాలియాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

Aug 1 2021 4:49 PM | Updated on Aug 1 2021 6:01 PM

CM KCR To Visit Halia On August 2nd - Sakshi

సాక్షి, నల్లగొండ: నల్లగొండ జిల్లా హాలియాలో రేపు(సోమవారం) ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయల్దేరనున్న కేసీఆర్‌.. హెలికాప్టర్‌లో ఉదయం 10.40కి హాలియా చేరుకోనున్నారు. అక్కడ నుంచి ఉదయం 10.55కి సభాస్థలి వ్యవసాయ మార్కెట్‌యార్డ్‌కు చేరుకుని మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమావేశంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 1.10కి ఎమ్మెల్యే భగత్‌ నివాసంలో భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌ బయల్దేరనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement