లాక్‌డౌన్‌ ‘స్క్రీన్‌టైమ్స్‌’

Children Addicted Smartphone And Electronic Gadgets - Sakshi

ఎలక్ట్రానిక్‌ గాడ్జెస్‌కు అతుక్కుపోతున్న యువత

రోజులో  7 గంటలు దాటి చూస్తే  ప్రమాదమే

ఆందోళన కలిగిస్తున్న డెవలప్‌మెంటల్‌ డిలే, ఎమోషనల్‌ డెఫిషియన్సీ

కోల్పోతున్న భావప్రకటన నైపుణ్యం, ప్రవర్తనలో అనూహ్యమార్పులు

ఇటీవల ఎక్కువగా నమోదవుతున్నాయంటున్న మానసిక వైద్య నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: స్క్రీన్‌టైమ్స్‌. అదేపనిగా మొబైల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్‌  గాడ్జెట్స్‌కు అతుక్కుపోయే అలవాటు. సాధారణంగా  ఇది  అతి పెద్ద సవాల్‌. ఈ అలవాటు ఒక పరిమితిని దాటడడం వల్ల అనేక రకాల అనర్థాలు చోటుచేసుకుంటాయి. ప్రస్తుత కరోనా కాలంలో ఈ ‘స్క్రీన్‌టైమ్స్‌’ ఒక సిండ్రోమ్‌ దశకు చేరుకుందని మానసిక వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నలుగురిలో  ఒకరు   దీని బారినపడి  చాలా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. ప్రత్యేకించి ఇది ‘ లాక్‌డౌన్‌ స్క్రీన్‌టైమ్స్‌’గా  యువతను పట్టి పీడిస్తోంది. ఆన్‌లైన్‌ తరగతుల వల్ల స్కూల్‌కు వెళ్లే పిల్లల నుంచి కాలేజీకి వెళ్లే యువత వరకు  లాక్‌డౌన్‌ స్క్రీన్‌టైమ్స్‌ వ్యసనంలా వేధిస్తోంది. ఒకవైపు స్కూళ్లు, కాలేజీలు లేకపోవడం వల్ల  మానసిక వికాసంలో స్తబ్దత కనిపిస్తుండగా ‘స్క్రీన్‌టైమ్స్‌’ దానికి మరింత ఆజ్యం పోస్తోందని  డాక్టర్లు పేర్కొంటున్నారు.  దీనివల్ల పలు మానసిక సమస్యలు  తలెత్తుతున్నట్లు  చెబుతున్నారు. కరోనా ఉధృతం కావడం, సాధారణ జనజీవితంపై నెలకొన్న అనిశ్చితి ఇందుకు ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న  ‘స్క్రీన్‌టైమ్స్‌’ టీనేజ్‌ పిల్లలకు అతి పెద్ద సవాల్‌గా మారింది.  

రోజుకు  7 గంటలు దాటితే అంతే.. 
చిక్కడపల్లికి చెందిన పదో తరగతి అమ్మాయి కొంతకాలంగా ఆన్‌లైన్‌ క్లాస్‌లకు హాజరవుతోంది. రెండు గదుల ఇంట్లో కుటుంబమంతా కలిసి ఉంటారు. తాను ఒక గదికి పరిమితమై  ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్‌ క్లాస్‌లు వింటుంది. ఆ తర్వాత మొబైల్‌ ఫోన్‌లోనే పలు ఫీచర్లు వీక్షిస్తూ గడిపేస్తుంది. అదేపనిగా ఫోన్‌ చూస్తుండడంతో తల్లి  ఆంక్షలు విధించింది. దీంతో ఆ అమ్మాయిలో విపరీతమైన కోపం, అసహనం, చికాకు పెరిగాయి. ఈ నేపథ్యంలో వైద్యుడిని సంప్రదించగా ‘తనకు జీవితంలో  ఫ్రీడమ్‌ లేకుండా పోయిందని, చనిపోవాలనిపిస్తోందని’ సదరు అమ్మాయి డాక్టర్‌ వద్ద ఏకరువు పెట్టింది. కావలసినంత సమయం  మొబైల్‌ఫోన్‌ చూసేందుకు తల్లి అంగీకరించకపోవడమే ఇందుకు కారణం.

ఆ ఒక్క అమ్మాయి మాత్రమే కాదు. చాలా మంది పిల్లల పరిస్థితి ఇలాగే ఉంది. లాక్‌డౌన్‌ టైమ్‌లో ఇది మరింత ఆందోళన కలిగిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. మానసిక వైద్య నిపుణుల విశ్లేషణ ప్రకారం 18 నెలల వయస్సు వరకు పిల్లలు ‘స్క్రీన్‌టైమ్స్‌’కు దూరంగా ఉండాలి. 5 ఏళ్లలోపు పిల్లలు గంట సేపు వీక్షించవచ్చు. ఎదుగుతున్న పిల్లలు 3 గంటల వరకు  మొబైల్, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్స్, టీవీ వంటివి చూడవచ్చు. టీనేజ్‌ పిల్లలు, యువత  7 గంటల కంటే ఎక్కువ సమయం ‘స్క్రీన్‌టైమ్స్‌’తో గడిపితే  మానసిక సమస్యలను ఎదుర్కోక తప్పదు. సాధారణంగానే గంటల తరబడి మొబైల్‌ ఫోన్‌లకు అతుక్కుపోయే కుర్రకారు లాక్‌డౌన్‌ టైమ్‌లో 15 గంటలకు పైగా ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నట్లు వైద్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి ఒంటిగంట వరకు కూడా  ‘స్క్రీన్‌టైమ్స్‌’లోనే కొట్టుకుపోతున్నారు. 

అనర్థాలు అనేకం... 
లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పుడు  ఆన్‌లైన్‌లో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలుడు కొద్ది రోజులుగా  తన గదికే పరిమితమయ్యాడు. ఎవరితోనూ మాట్లాడడం మానేశాడు. తనకు తాను పూర్తిగా ఐసోలేట్‌ కావడంతో పేరెంట్స్‌ ఆందోళనకు గురయ్యారు. వైద్యులను సంప్రదించగా శారీరకంగా ఎలాంటి అనారోగ్యం లేదని నిర్ధారించారు. చివరకు  సికింద్రాబాద్‌లో ఒక సైకియాట్రిస్టును సంప్రదించగా రాత్రింబవళ్లు ఫోర్న్‌సైట్స్‌ చూస్తున్నట్లు కౌన్సెలింగ్‌లో వెల్లడైంది. సాధారణంగా ఉదయం టిఫిన్‌ చేసి కాలేజీకి లేదా స్కూల్‌కు  వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చి ఆట, పాటలతో సరదాగా గడపాల్సిన  పిల్లలు అందుకు పూర్తిగా భిన్నమైన వాతావరణంలో ఉండడం వల్ల అనేక రకాల అనర్థాలు  చోటుచేసుకుంటున్నాయి. స్క్రీన్‌టైమ్స్‌కు బానిసలుగా మారుతున్నారు. తమకు తెలియకుండానే రకరకాల తప్పులు చేస్తున్నారు. 

మూర్తిమత్వ వికాసానికి విఘాతం ..
సాధారణంగా ఏ వయస్సులో రావలసిన మార్పు ఆ వయస్సులో రాకపోతే ‘డెవలప్‌మెంటల్‌ డిలే’ అంటారు. స్క్రీన్‌టైమ్స్‌ వల్ల  మానసిక ఎదుగుదల కొరవడుతుంది. మూర్తిమత్వ వికాసానికి ఇది విఘాతం కలిగిస్తుంది. 
ఇరువై నాలుగు గంటలు స్క్రీన్స్‌కు అతుక్కుపోవడం వల్ల  భావప్రకటనా నైపుణ్యం (కమ్యూనికేషన్స్‌ స్కిల్‌) కోల్పోతున్నారు. 
 మొదడులో ఆలోచనా శక్తిని, చైతన్యాన్ని పెంచే న్యూరాన్స్‌లో మార్పుల వల్ల ప్రవర్తనలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. 
ఆపదలో ఉన్నవారిని ఆదుకొనే స్వభావాన్ని కోల్పోతున్నారు. తోటి వారి పట్ల, కుటుంబం పట్ల ఉండవలసిన  ప్రేమ, దయ, సానుభూతి, ఆప్యాయత సానుభూతి వంటివి కొరవడడం ‘స్క్రీన్‌టైమ్స్‌’ అనర్థాల్లో మరికొన్ని. 

అభిరుచుల్లో మార్పు అవసరం 
మెబైల్‌ ఫోన్లు, ఇతర గాడ్జెట్స్‌కు కేటాయించే సమయాన్ని తగ్గించుకోవాలి. మనస్సుకు నచ్చే అభిరుచులను అలవర్చుకోవాలి. సంగీతం, సినిమా, ఆటలు, పాటలు మంచిదే. ఈ లాక్‌డౌన్‌ టైమ్‌లో  వ్యాయామం, యోగ, ప్రాణాయామం వంటివి అలవాటు చేసుకోవడం వల్ల  మానసిక వికాసం మెరుగుపడుతుంది. పఠనాశక్తి పెరుగుతుంది. విషయాన్ని గ్రహించే నైపుణ్యం, భావప్రకటన కూడా  బాగుంటాయి. – డాక్టర్‌ సంహిత, సీనియర్‌ సైకియాట్రిస్టు, పద్మారావునగర్‌ 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

03-12-2020
Dec 03, 2020, 20:27 IST
న్యూయార్క్‌: ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను ఆరికట్టేందుకు వ్యాక్సిన్ ఎప్పుడేప్పుడు వస్తుందా అని ప్రపంచ దేశాల ప్రజలు ఎదురు చుస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్‌...
03-12-2020
Dec 03, 2020, 17:34 IST
సాక్షి, న్యూఢిల్లీ : ‘ప్రపంచ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోన్న కరోనా వైరస్‌ మహమ్మారిని తుదముట్టించేందుకు ఏడాది కాలంలోగానే ‘కోవిడ్‌’...
03-12-2020
Dec 03, 2020, 13:32 IST
అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో  అమెరికా మాజీ అధ్యక్షులు ముగ్గురు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు.
03-12-2020
Dec 03, 2020, 11:29 IST
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారికి వ్యాక్సిన్‌ను బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించడంతో  భారతీయులు  బ్రిటన్‌ వెళ్లేందుకు క్యూ కడుతున్నారు....
03-12-2020
Dec 03, 2020, 10:43 IST
ప్రముఖ వ్యాపారవేత్త, పిజ్జా హట్ సహ వ్యవస్థాపకుడు ఫ్రాంక్ కార్నే(82) న్యుమోనియాతో మరణించారు.
03-12-2020
Dec 03, 2020, 10:06 IST
సాక్షి, హైదరాబాద్ ‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 53,686 కరోనా వైరస్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 609 పాజిటివ్‌ కేసులు...
03-12-2020
Dec 03, 2020, 10:05 IST
రాజస్థాన్‌ దౌసాకు చెందిన జైపూర్ మాజీ మహారాజా, మాజీ ఎంపీ పృథ్వీరాజ్ (84) కన్నుమూశారు.
03-12-2020
Dec 03, 2020, 04:09 IST
న్యూఢిల్లీ: ఆశలు చిగురిస్తున్నాయి, ఎదురు చూపులు ఫలించనున్నాయి. 2021 వస్తూ వస్తూ మంచి శకునాలు మోసుకురాబోతోంది కరోనా వ్యాక్సిన్‌ వచ్చే...
03-12-2020
Dec 03, 2020, 01:55 IST
సాక్షి, హైదరాబాద్‌: అక్టోబర్‌లో దసరా.. నవంబర్‌లో దీపావళి.. మరోవైపు చలికాలం.. ఆయా సందర్భాల్లో కరోనా తీవ్రంగా పెరుగుతుందని సర్కార్‌ తీవ్ర...
03-12-2020
Dec 03, 2020, 01:53 IST
లండన్‌: ఫైజర్‌– బయో ఎన్‌ టెక్‌ రూపొందించిన టీకా అత్యవసర వినియోగానికి బ్రిటిష్‌ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌కు...
03-12-2020
Dec 03, 2020, 00:40 IST
మానవాళి అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ శరవేగంతో అందుబాటులో కొస్తోంది. అందరికన్నా ముందు వ్యాక్సిన్‌ తీసుకొచ్చి అగ్రగాములం...
02-12-2020
Dec 02, 2020, 20:42 IST
మాస్కో: ప్రపంచ దేశాలన్ని ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. త్వరగా టీకాని తీసుకువచ్చి.. సురక్షితమని నిరూపించి.. ఇతర దేశాలకు...
02-12-2020
Dec 02, 2020, 15:04 IST
బీజింగ్‌: కరోనా వైరస్‌ ప్రపంచాన్నిగడగడలాడిస్తోంది. మహమ్మారి బారిన పడి లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు...
02-12-2020
Dec 02, 2020, 13:21 IST
కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి.
02-12-2020
Dec 02, 2020, 10:51 IST
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 565 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్‌...
02-12-2020
Dec 02, 2020, 08:09 IST
గుజరాత్‌కు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యులు అభయ్ భరద్వాజ్  కన్నుమూశారు.
02-12-2020
Dec 02, 2020, 05:26 IST
కరోనాను కట్టడి చేసేందుకు దేశంలోని అందరికీ వ్యాక్సినేషన్‌ చేయాల్సిన అవసరం లేదని, అవసరమైనంత మందికి వ్యాక్సిన్‌ ఇస్తే సరిపోతుందని కేంద్రం...
02-12-2020
Dec 02, 2020, 04:59 IST
న్యూఢిల్లీ: కోవిడ్‌–19 బాధితుల ఇళ్ల వద్ద అధికారులు పోస్టర్లు అంటిస్తుండటంతో ప్రజలు వారిని అంటరానివారిగా చూస్తున్నారనీ, క్షేత్ర స్థాయి పరిస్థితికి...
02-12-2020
Dec 02, 2020, 02:07 IST
సియోల్‌: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్, ఆయన కుటుంబసభ్యులు, ఆదేశ సీనియర్‌ అధికారులు, నేతలపై చైనా కోవిడ్‌...
01-12-2020
Dec 01, 2020, 20:11 IST
న్యూఢిల్లీ: కరోనా టీకా ‘కోవిషీల్డ్‌’ ట్రయల్స్‌లో పాల్గొన్న తనకు ఆరోగ్యపరంగా దుష్ప్రభావాలు కలిగాయని, తీవ్రమైన మానసిక సమస్యలు తలెత్తాయని చెన్నైలోని ఒక...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top