యూరియా సరఫరాపై కేంద్రంతో తెలంగాణ సమన్వయం | centre gives green signal for fertilizer supply: Telangana | Sakshi
Sakshi News home page

యూరియా సరఫరాపై కేంద్రంతో తెలంగాణ సమన్వయం

Jun 2 2026 5:49 AM | Updated on Jun 2 2026 5:49 AM

centre gives green signal for fertilizer supply: Telangana

సాక్షి, హైదరాబాద్‌: యూరియా సరఫరా, రవాణా అంశాలపై కేంద్ర ప్రభుత్వంతో నిరంతర సమన్వయం కొనసాగిస్తున్నట్టు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నెలకు 10 లక్షల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న యూరియా కేటాయింపును 11.5 లక్షల మెట్రిక్‌ టన్నులకు పెంచాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు తుమ్మల లేఖ రాశారు.

ఆర్‌ఎఫ్‌సీఎల్‌ నుంచి ప్రత్యేకంగా 2 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా కేటాయించాలని కోరారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి నడ్డా.. రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫ రాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారు. 

పోర్టుల వద్ద నిల్వల తరలింపు ఆలస్యమవుతోందని కేంద్ర పోర్టు లు, షిప్పింగ్‌ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్‌కు తుమ్మల లేఖ రాశారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి విశాఖపట్నం, వీఓ. చిదంబరనార్‌ పోర్టు అధికారులకు అత్యవసర ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణకు కేటాయించిన యూరియా రవాణాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement