చేవెళ్ల: ‘ఇలాంటి ప్రమాదం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. కళ్ల ముందే టిప్పర్ మృత్యువులా దూసుకొచ్చింది. బస్సుపైకి వస్తున్న లారీని చూసి డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. అయినా లారీ ఒక్కసారిగా బస్సుపైకి వచ్చింది. ఈ కుదుపునకు నేను కూర్చున్న సీటు ముందు ఉన్న రాడ్‌కు తల బలంగా ఢీకొట్టింది. కంకరలో నా కాళ్లు మునిగిపోయాయి.
అప్పటికే బస్సులో క్షేమంగా బయట పడినవారు, వెనుక బస్సుల్లో వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లు నన్ను బయటకు లాగారు. 18 కుట్లు పడ్డాయి. నిన్ననే చిన్న సర్జరీ చేశారు. 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉండాలని వైద్యులు చెప్పారు. ప్రతిరోజూ ఉదయం 4:40 గంటలకు బయలుదేరుతాం. ఆ రోజు 4:50కి స్టార్ట్ అయ్యాం ’ బస్సు కండక్టర్ రాధ చెప్పారు.


