సర్పంచ్ పదవి.. రాజకీయాలకు తొలిమెట్టు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
మోమిన్‌పేట: స్థానిక సమస్యలపై దృష్టి సారించి పాలనపై పట్టు సాధించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని మల్లారెడ్డిగూడెం సర్పంచ్ నిర్మలా ఉపేందర్‌రెడ్డి శనివారం బీజేపీలో చేరారు. ఈ మేరకు కిషన్ రెడ్డి నగరంలోని తన నివాసంలో వారికి బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా రాణించేందుకు సర్పంచ్ తొలిమెట్టు అన్నా రు. గ్రామాల అభివృద్ధిలో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అసెంబ్లీ కోఆర్డినేటరు వడ్ల నందు, విక్రంరెడ్డి, గ్రామస్తులు ఉన్నారు.
సర్పంచ్‌కు మీనాక్షినటరాజన్ అభినందనలు
అనంతగిరి: వికారాబాద్ మండల ఎర్రవల్లికి చెందిన ఆర్టీఏ సభ్యుడు ఎర్రవల్లి జాఫర్ కుమారుడు రబ్బానీ ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌గా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో జాఫర్ తన కుమారుడితో కలిసి హైద్రాబాద్‌లో కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమె రబ్బానీని అభినందించారు.
మరో భూ సేకరణకు నోటిఫికేషన్
దుద్యాల్ తహసీల్దార్ కిషన్
దుద్యాల్:ప్రభుత్వం మండల పరిధిలో 139.98 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు తహసీల్దార్ కిషన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. గ్రామంలోని సర్వేనంబర్ 363లో 85 మంది రైతుల నుంచి అసైన్డ్ భూములకు సేకరించనుందని తెలిపారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఆధ్వర్యంలో పారిశ్రామిడ ఏర్పాటుకు ఈ భూసేకరణ చేపడుతున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఏడాది క్రితం మండల పరిధిలోని లగచర్ల, హకీంపేట్, పోలేపల్లి గ్రామాల్లో పారిశ్రామిక వాడ ఏర్పాటుకు 1,175.35 ఎకరాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అందుకు సంబందించిన 1,10 ఎకరాల భూసేకరణ పూర్తయింది. మిగలిన 74.35 ఎకరాలకు రైతులు అంగీకారం తెలపకపోవడంతో ప్రభుత్వం జనరల్ అవార్డు ప్రకటించింది. ఇటీవల హకీంపేట్, పోలేపల్లి గ్రామాలకు సంబంధించి 55.36 ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చిన విషయం విదితమే.
ఎర్త్ సెంటర్‌కు ‘ఆట’ ప్రతినిధులు
కడ్తాల్: మండల పరిధిలోని అన్మాస్‌పల్లి సమీపంలోని ‘ది ఎర్త్ సెంటర్’ను అమెరికాతెలుగు అసోసియేషన్ (ఆటా) ప్రతినిధులు శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కౌన్సిల్‌ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్ పర్సన్ లీలాలక్ష్మారెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షుడు లక్ష్మారెడ్డితో సమావేశమయ్యారు. భూగ్రహం సుస్థిరత, పర్యావరణ పరిరక్షణ కోసం కలిసి పనిచేయడానికి అవకాశాలపై చర్చించారు. సీజీఆర్, ఆటా సంయుక్తంగా అటు అమెరికాలో, ఇటు భారతదేశంలో చేపట్టబోయే పర్యావరణ కార్యక్రమాలపై ప్రాథమికంగా చర్చలు జరిపారు. సీనియర్ జర్నలిస్ట్, సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో 15 సంవత్సరాలుగా సీజీఆర్ సంస్థ చేపడుతున్న పర్యావరణ హిత కార్యక్రమాలను ‘ఆట’ ప్రతినిధులకు వివరించారు. పర్యావరణ పరిరక్షణకు సీజీఆర్ సంస్థ చేపడుతున్న సేవలు బాగున్నాయిని వారు కితాబిచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, ఆటా అధ్యక్షుడు జయంత్ చల్లా, ప్రెసిడెంట్ ఎలెక్ట్ సతీష్‌రెడ్డి, ప్రతినిధులు పాల్గొన్నారు.
సర్పంచ్ పదవి.. రాజకీయాలకు తొలిమెట్టు
సర్పంచ్ పదవి.. రాజకీయాలకు తొలిమెట్టు


