పనితీరు నచ్చి కాంగ్రెస్‌లో చేరిక
పరిగి: ప్రజాపాలన పనితీరు నచ్చి నూతన సర్పంచ్‌లు స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శనివారం ఎమ్మెల్యే నివాసంలో నియోజకవర్గంలోని నలుగురు సర్పంచ్‌లు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా టీఆర్‌ఆర్ మాట్లాడుతూ.. పరిగి మండలం రావుపల్లి సర్పంచ్ మంజుల, కుల్కచర్ల మండలం లాల్‌సింగ్‌తండా సర్పంచ్ శ్రీనివాస్, దోమ మండలం బట్లచందారం సర్పంచ్ పద్మమ్మ, గండీడ్ మండలం ఆశిరెడ్డిపల్లి సర్పంచ్ భగవంత్‌రెడ్డిలు పార్టీలో చేరారన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే ఇచ్చిన హామీలను అమలు చేసిందన్నారు. గత ప్రభుత్వం పదేళ్లు అధికారంలో ఉండి ఒక్క ఇల్లు ఇవ్వలేదన్నారు. జిల్లాలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు అధికంగా పరిగి నియోకవర్గంనుంచి గెలుపొందారన్నారు. పేదల సంక్షేమానికి సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ పరశురాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు కృష్ణ, ఏబ్లాక్ అధ్యక్షుడు పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.


