బీజేపీ విధానాలను ఎండగడుతాం
తాండూరు: కేంద్రంలోని బీజేపీ సర్కార్ మతవిద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గడుపుకొంటోందని డీసీసీ అధ్యక్షుడు ధారాసింగ్ జా దవ్ విమర్శించారు.శనివారం ఆయన తాండూ రు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో విలేకరు ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చి న వెంటనే నల్లధనాన్ని తెచ్చి పేదలకు రూ. 15లక్షల చొప్పున ఖాతాల్లో జమచేస్తామని మోసం చేసిందన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ స మయంలో నేషనల్ హెరాల్డ్ పత్రిక కీలకంగా ఉందన్నారు. జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబానికి చెందిన పత్రిక కావడంతో బీజేపీ ప్రభు త్వం పత్రికపై విషం చిమ్మిందన్నారు. కోర్టులో పత్రికను అనుకూలంగా తీర్పు రావడంతో పాటు కేసు డిస్మిస్ చేసిందన్నారు. 2005లో నా టి కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించేందుకు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం అమలు చేసిందన్నారు. 20 ఏళ్లుగా ఈ పథకం ద్వారా ఎంతో మంది గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి ల భించిందన్నారు. కొన్నాళ్లుగా ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ వస్తోందన్నారు. ఇటీవల పథకం పేరు మార్చిందని మండిపడ్డారు. తాండూరులోని సిమెంట్ పరిశ్రమ ఇప్పటికే అదాని చేతిలోకి వెళ్లిందన్నారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ సర్కిల్ నుంచి గాంఽధీ పార్కు వరకు నిరసన ర్యాలీ,గాంఽధీ పార్కులో ధర్నా చేపడతామన్నారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజాప్ర తి నిధులు,నాయకులు పార్టీ శ్రేణులు, మద్దతు దారులు పెద్దఎత్తున హాజరుకావాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు హబీబ్‌లాల, నాయకులు తదితరులున్నారు.


