పల్లెలకు కొత్తకళ
రెండేళ్ల తర్వాతగ్రామ సచివాలయాలకు కొత్తకళ కార్యాలయ బోర్డులో పాలకమండలి వివరాలు విద్యుత్ కాంతులతో జిగేల్ మంటున్న వీధులు
యాలాల: రెండేళ్ల అనంతరం గ్రామసచివాలయా లు కళకళలాడనున్నాయి. రేపు సర్పంచుల ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఏర్పాట్లు జరుగుతుండగా.. అంతకు ముందే పంచాయతీ కార్యాలయ భవనాలను సుందరీకరిస్తున్నారు. రంగులతో ముస్తాబు చేయించారు. విద్యుత్ దీపాలతో అలంకరించారు.
సామగ్రి ఏర్పాటు
జిల్లాలో మొత్తం 194 పంచాయతీలు ఉన్నాయి. మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించగా అధికార కాంగ్రెస్ ముందంజలో ఉంది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్ సైతం హోరాహోరీగా పోరాడింది. బీజేపీ పట్టుకో సం ప్రయత్నించింది. కొత్తగా పాలకవర్గం తమ పరిపాలనను ప్రారంభించేందుకు అనువుగా గ్రామ సచివాలయాలను తీర్చిదిద్దుతున్నారు. భవనాలకు రంగులతో పాటు కొత్తగా కుర్చీలు, పాలకవర్గ సభ్యుల వివరాలను భవనాల గోడలపై రాయించారు. కొన్ని పంచాయతీల్లో ప్రధాన వీధు ల్లో భారీ ఎల్‌ఈడీలను ఏర్పాటు చేయించారు.
రేపు ప్రమాణస్వీకారం
నూతన పాలకవర్గ సభ్యుల ప్రమాణ స్వీకారం ఈ నెల 20న చేపట్టాలని తొలుతు అనుకున్నారు. 20న శనివారం కావడంతో తేదీని మార్చాలని కొందరు నేతలు ప్రభుత్వ పెద్దలు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆ సమయాన్ని ఈ నెల 22కు మార్చుతున్నట్లు పంచాయతీ రాజ్‌శాఖ ఉన్నతాధికారులు ప్రకటించారు.
బాధ్యతలే ముందు..
దుద్యాల్: సర్పంచ్‌గా గెలిచాడు. ప్రమాణం చేయలేదు. అయినా బాధ్యతలను ఎరిగి.. గ్రామంలో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి ముందుకు వచ్చాడు. నీటి కటకట తీర్చి, ప్రజల మన్ననలు పొందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల పరిధి సంట్రకుంటతండాకు సరఫరా అయ్యే బోరు మోటార్ నెల రోజుల క్రితం మరమ్మతుకు గురైంది. దీంతో తండాలో నాటి నుంచి తాగునీటి సమస్య నెలకొంది. రోడ్డు పనులు జరుగుతుండడంతో పైప్‌లైన్ లీకేజీ కారణంగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచి, సమస్య జఠిలంగా మారింది. దీంతో తండా వాసులు వ్యవసాయ బోర్ల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. విషయం తెలుసుకున్న కొత్త సర్పంచ్ మాణిక్య నాయక్.. బోరు మోటార్‌కు శనివారం మరమ్మతు చేయించి, నీటి సరఫరాను పునరుద్ధరించారు. దీంతో గ్రామస్తులు ఆయనకు అభినందనలు తెలిపారు. ఆయన వెంట స్థానికులు బాబు నాయక్, వార్డు సభ్యుడు రాహుల్ ఉన్నారు.
కొలువుదీరనున్న సర్పంచులు
సమస్యలు తీరినట్లే..
దౌల్తాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికల ఘట్టం ముగిసింది. నూతన సర్పంచులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో పల్లెల్లో సందడి నెలకొంది. ఇంత వరకు బాగానే ఉన్నా.. రెండేళ్ల పాటు పంచాయతీల్లో ప్రత్యేక పాలన కొనసాగినప్పటికీ.. సమస్యలు పేరుకుపోయి.. పాలన అస్తవ్యస్తంగా మారిందని, కొత్త సర్పంచుల రాకతో ఇక సమస్యలు తీరినట్లేనని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తుండగా.. అభివృద్ధి పనుల్లో వేగం పెరగనుందని అధికారులు పేర్కొంటున్నారు. కాగా.. గడిచిన కాలంలో స్థానిక పాలకులు లేక బోసిన గ్రామ సచివాలయాలకు కొత్తకళ సంతరించుకుంది. భవనాలను రంగులు వేయించి, విద్యుత్ దీపాలతో కళకళలాడేలా చేస్తున్నారు కార్యదర్శులు. కావాల్సిన సామగ్రిని సమకూరుస్తున్నారు.
రెండేళ్ల అనంతరం కొత్త పాలకులుకొలుదీరనుండటంతో పల్లెల్లో సందడి నెలకొంది. వారికి స్వాగతం పలికేందుకు కార్యదర్శులు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా గ్రామ సచివాలయాలను తీర్చిదిద్దుతున్నారు. కావాల్సిన సామగ్రిని సమకూరుస్తుండగా.. ఇక సమస్యలు తీరినట్లేనని, గ్రామాలు అభివృద్ధి చెందనున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెలకు కొత్తకళ
పల్లెలకు కొత్తకళ


