మైనింగ్‌ కేసు: ఈడీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే | BRS MLA Mahipal Reddy Attend ED Investigation Over Mining Case, More Details Inside | Sakshi
Sakshi News home page

Mining Case: ఈడీ ఎదుట హాజరైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే

Jul 2 2024 1:10 PM | Updated on Jul 2 2024 1:37 PM

brs mla mahipal reddy attend ED investigation over mining case

హైదరాబాద్‌,సాక్షి: పటాన్‌చెరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మహిపాల్‌ రెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారుల ఎదుట హాజరయ్యారు. మైనింగ్‌ కేసులో ఈడీ ఆయనపై అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. 

మైనింగ్‌ కేసులో మహిపాల్‌రెడ్డి రూ. 300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అభియోగాలు మోపింది. ఇటీవల ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డితోపాటు ఆయన సోదురుడి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఆయన ఈడీ ముందుకు వెళ్లాల్సి ఉంది. అయితే ఈడీ ప్రత్యేక అనుమతితో ఇవాళ హాజరయ్యారు. 

మైనింగ్ తవ్వకాల్లో ప్రభుత్వానికి టాక్స్ చెల్లించకుండా ఎగ్గొట్టారని ఆరోపణలు ఉన్నాయి.  సంతోష్ సాండ్ అండ్ గ్రానైట్ పేరుతో మహిపాల్ రెడ్డి వ్యాపారం చేశారు.  రూ. 39 కోట్ల రూపాయల వరకు టాక్స్ ఎగ్గొట్టారని ఈడీ ఆరోపణలు చేస్తోంది. మైనింగ్‌లో వచ్చిన లాభాలన్నీ రియల్ ఎస్టేట్‌తో పాటు బినామీ పేర్లతో వ్యాపారాలు సాగిస్తున్నారని ఈడీ గుర్తించింది. సంగారెడ్డి పటాన్‌చెరు పరిసర ప్రాంతాల్లో మహిపాల్ సోదరులు మైనింగ్ నిర్వహించాని ఈడీ తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement