Will Demolish the Domes of Telangana’s New Secretariat: Bandi Sanjay - Sakshi
Sakshi News home page

కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తాం: బండి సంజయ్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Feb 10 2023 12:23 PM | Updated on Feb 10 2023 1:59 PM

Bandi Sanjay Shocking Comments On Telangana New Secretariat - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో పొలిటికల్‌ హీట్‌ మరోసారి పెరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామని షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. 

కాగా, బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కొత్త సచివాలయంలో మార్పులు చేస్తాము. తెలంగాణ సంస్క​ృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా మారుస్తాము. బీజేపీ అధికారంలోకి రాగానే కొత్త సచివాలయం డోమ్‌లు కూల్చివేస్తామన్నారు. ప్రగతిభవన్‌ను కూడా ప్రజా దర్బార్‌గా మారుస్తామని కామెంట్స్‌ చేశారు.    కాగా, బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాశంగా మారాయి. 

ఈ క్రమంలోనే కేటీఆర్‌కు బండి సంజయ్‌ సవాల్‌ విసిరారు. రోడ్లకు అడ్డంగా ఉన్న గుళ్లు, మసీదులు కూల్చేస్తామని కేటీఆర్‌ చెబుతున్నారు. దమ్ముంటే పాతబస్తీ నుంచే ఇది మొదలుపెట్టాలి. కేసీఆర్‌ తెలంగాణను ఎంఐఎంకి కట్టబెట్టాలని చూస్తున్నారు. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం రెండూ ఒక్కటే. బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పోటీచేస్తే డిపాజిట్లు కూడా రాకుండా చేస్తాము. 

తెలంగాణలో నిజాం రాజ్యం పోవాలి. మన రాజ్యం రావాలి. కరెంట్‌ ఇవ్వడం లేదు. పొలాలు ఎండిపోతున్నాయి. రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాతబస్తీలో యువతకు ఎందుకు ఉద్యోగాలు, పాస్‌పోర్టులు ఎందుకు రావడంలేదో ఎంఐఎం నేతలు, పాతబస్తీలు ఆలోచించుకోవాలి. దేశంలో ఎక్కడ ఎలాంటి ఘటనా జరిగినా పాతబస్తీకి చెందిన వ్యక్తులే ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement