గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్ | Anti Corruption Group Ask Guinness Book Name For Keesara MRO | Sakshi
Sakshi News home page

గిన్నిస్ బుక్ రికార్డులోకి కీస‌ర త‌హ‌సీల్దార్

Aug 25 2020 7:49 PM | Updated on Aug 25 2020 7:55 PM

Anti Corruption Group Ask Guinness Book Name For Keesara MRO - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అవినీతి నిరోధక‌శాఖకు ప‌ట్టుబ‌డ్డ కీస‌ర త‌హ‌సీల్దార్ బాల‌రాజు నాగ‌రాజు పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కించాల‌ని అవినీతికి వ్య‌తిరేకంగా ఉద్య‌మిస్తున్న‌ చెందిన రెండు స్వ‌చ్ఛంద సంస్థ‌లు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ను కోరాయి. ఒక‌ భూప‌ట్టా విష‌యంలో రూ.2 కోట్ల‌కు డీల్ మాట్లాడుకుని రూ. 1.10 కోట్లు స్వీక‌రిస్తూ ఇటీవ‌లే త‌హ‌సీల్దార్ ప‌ట్టుబ‌డిన విష‌యం తెలిసిందే. ఒక ప్ర‌భుత్వ ఉద్యోగి 20 మిలియ‌న్ల‌ను లంచం రూపంలో తీసుకుంటూ ప‌ట్టుబ‌డ‌టం ప్ర‌పంచంలోనే ఇదే తొలిసారి అయి ఉండ‌వ‌చ్చ‌ని యూత్ ఫ‌ర్ యాంటీ క‌రప్ష‌న్ (వైఏసీ) అధ్య‌క్షుడు ప‌ల్నాటి రాజేంద‌ర్, వ‌రంగ‌ల్ కేంద్రంగా అవినీతి వ్య‌తిరేక అవ‌గాహ‌న‌ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న జ్వాల సంస్థ అధ్య‌క్షుడు సుంక‌రి ప్ర‌శాంత్ గిన్నిస్ బుక్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కు ఆన్ లైన్లో చేసుకున్న ద‌ర‌ఖాస్తులో తెలిపారు. దీనికి గిన్నిస్ బుక్ సంస్థ స్పందించింది. ప్ర‌భుత్వ అధికారుల అవినీతికి సంబంధించిన త‌మ‌వ‌ద్ద ఇంత‌వ‌ర‌కు ఎలాంటి కేట‌గిరీ లేద‌ని, దీనికోసం ప్ర‌త్యేకంగా కేట‌గిరి ప్రారంభించే విషయాన్ని ప‌రిశీలిస్తామ‌ని తెలిపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement