బ్యాటింగ్‌.. జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి.. బౌలింగ్‌.. జస్టిస్‌ లక్ష్మీనారాయణ | Advocates A Team Wins High Court Judges Lawyers Cricket Tournament In Secunderabad | Sakshi
Sakshi News home page

బ్యాటింగ్‌.. జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి.. బౌలింగ్‌.. జస్టిస్‌ లక్ష్మీనారాయణ

Mar 23 2026 9:13 AM | Updated on Mar 23 2026 11:01 AM

advocates a team wins high court cricket tournament secunderabad

జింఖానా మైదానంలో ముగిసిన హైకోర్టు జడ్జీలు–అడ్వొకేట్ల టోర్నమెంట్‌

హైదరాబాద్: సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో మూడు రోజులపాటు జరిగిన హైకోర్టు జడ్జీలు–అడ్వొకేట్ల క్రికెట్‌ టోర్నమెంట్‌లో అడ్వకేట్స్‌ ‘ఏ’ జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం జరిగిన తొలి రోజు పోటీల్లో చీఫ్‌ జస్టిస్‌ జట్టు ‘ప్రెసిడెంట్‌ లెవెన్‌’పై విజయం సాధించింది. 

అనంతరం అడ్వొకేట్స్‌ ‘ఏ’, ‘డీ’ జట్లు ఫైనల్‌కు చేరగా, ఆదివారం జరిగిన ఫైనల్లో అరవింద్‌ నేతృత్వంలోని ‘ఏ’ జట్టు గెలుపొందింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ‘డీ’ జట్టు 6 ఓవర్లలో 54 పరుగులు చేయగా, ‘ఏ’ జట్టు 4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయ్‌సేన్‌ రెడ్డి, జస్టిస్‌ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథులుగా హాజరై ఫైనల్‌ మ్యాచ్‌ను ప్రారంభించి, సరదాగా కాసేపు ఆడారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement