ఆరేళ్ల బాలికపై లైంగికదాడి.. ఆదిలాబాద్‌ కోర్టు సంచలన తీర్పు

Adilabad Court Sentenced 20 Years Prison For Rape Case Accused - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: జిల్లాలో ఆరేళ్ల బాలికపై లైంగిక దాడి కేసులో ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు సంచలన తీర్పును ఇచ్చింది. కాగా, కోర్టు తీర్పుపై బాధితులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఉట్నూర్‌ బస్‌స్టేషన్‌ సమీపంలో ఈ ఏడాది ఏప్రిల్‌ 15వ తేదీన షేక్‌ ఖాలిద్‌(45) అనే వ్యక్తి ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. దీంతో, నిందితుడిపై పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణ సందర్భంగా జిల్లా కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటుగా రూ. 2వేల జరిమానా విధించింది. కాగా, ఈ జైలు శిక్ష.. జీవిత ఖైదు కన్నా ఎక్కువ కావడం విశేషం. 

ఈ సందర్భంగా కోర్టు తీర్పుపై పోలీసులు స్పందించారు. ఈ దారుణ ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు నిందితుడిని పట్టకుని పోక్సో​ చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం, 60 రోజుల్లోనే ఛార్జ్‌షీట్‌ వేసినట్టు పోలీసులు స్పష్టం చేశారు. తర్వాత, పోలీసులందరూ టీమ్‌గా వర్క్‌గా పనిచేసి కోర్టుకు సకాలంలో అన్ని ఆధారాలను సమర్పించారు. కేవలం 135 రోజుల్లోనే కోర్టు విచారణ చేసినట్టు తెలిపారు. ఇక, నిందితుడి ఇలాంటి వేయడంపట్ల హర్షం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పుతోనైనా భవిష్యత్త్‌లో ఇలాంటి దారుణాలు చేసేందుకు నిందితులు భయపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top