వరంగల్‌: ఎస్‌బీఐ బ్యాంకుకు తాళం | Account Holders Lock Sbi Bank In Rayaparthy Warangal | Sakshi
Sakshi News home page

వరంగల్‌: ఎస్‌బీఐ బ్యాంకుకు తాళం

Apr 4 2025 3:26 PM | Updated on Apr 4 2025 4:42 PM

Account Holders Lock Sbi Bank In Rayaparthy Warangal

వరంగల్‌, సాక్షి: రాయపర్తిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బ్రాంచ్‌కు తాళం పడింది. ఖాతాదారులే బ్యాంకు సిబ్బందిని బయటకు వెళ్లగొట్టి మరీ తాళం వేశారు. తమ బంగారం తమకు ఇప్పించాలంటూ నినాదాలు చేస్తూ బయట నిరసనకు దిగారు. బ్యాంకులో చోరీ అయిన బంగారం ఇప్పించాని ఖాతాదారులు డిమాండ్‌ చేశారు.

నవంబర్‌ 19న రాయపర్తి ఎస్‌బీఐ శాఖలో బంగారం చోరీ జరిగింది. 650 ఖాతాదారుల 20 కేజీల బంగారం చోరీ అయినట్లు గుర్తించారు. తమ బంగారం అడిగితే బ్యాంకు చుట్టూ తిప్పిస్తున్నారని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బ్యాంకు సిబ్బందిని బయటకు పంపించిన ఖాతాదారులు తాళం వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement