
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో ప్రైవేట్ ఆస్పత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపేయాలని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవల్ని నిలిపివేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
ఈ సందర్భంగా ప్రభుత్వం తమకు వందల కోట్లలో బకాయిలు చెల్లించాల్సి ఉందని, వాటిని తక్షణమే చెల్లించాలని ప్రైవేట్ ఆస్పత్రి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేని పక్షంగా తమ ఆందోళనల్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించాయి.