
నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ట్యాంక్‌బండ్‌కు చేరుకొనేందుకు 600 ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. కాచిగూడ, రాంనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులతోపాటు హయత్‌నగర్, వనస్థలిపురం, ఎల్‌బీనగర్ తదితర ప్రాంతాల నుంచి వచ్చే బస్సులను హిమాయత్‌నగర్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు నడుపుతారు. ఉప్పల్, సికింద్రాబాద్ వైపు నుంచి వచ్చే బస్సులను ఇందిరాపార్కు వరకు అందుబాటులో ఉండేవిధంగా ఏర్పాట్లు చేశారు. బీహెచ్‌ఈఎల్, పటాన్‌చెరు, మియాపూర్, కూకట్‌పల్లి, తదితర ప్రాంతాల నుంచి నడిచే బస్సులు ఖైరతాబాద్ వరకు రాకపోకలు సాగిస్తాయి. బోడుప్పల్ వైపు నుంచి వచ్చే కొన్ని బస్సులను లిబర్టీ వరకు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. మెహదీపట్నం వైపు నుంచి వచ్చే వాటిని లక్డీకాపూల్ వరకు నడుపుతారు. సమాచారం కోసం 99592 26160, 99592 26154 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.
ఏర్పాట్ల వివరాలు నగరంలోని మండపాలు
దాదాపు 50 వేలు
(రిజిస్టర్ అయినవి 11,850)
శుక్రవారం నాటికి
నిమజ్జనమైనవి: 9 వేలకు పైగా
ఊరేగింపు మార్గం: 303 కిమీ
ఇందులో పాల్గొనే భక్తులు 10 లక్షల నుంచి 15 లక్షలు
నిమజ్జనం జరిగే ప్రధాన ట్యాంకులు
ట్యాంక్‌బండ్, రాజన్న బౌలి, మీరాలం ట్యాంక్, ఎర్రకుంట చెరువు, షేక్‌పేట చెరువు, సరూర్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్, సఫిల్‌గూడ/మల్కాజ్‌గిరి చెరువులు, హస్మత్‌పేట చెరువు
హుస్సేన్‌సాగర్‌కు వచ్చేవి
హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండలతో పాటు మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన విగ్రహాలు.
బందోబస్తులో పాల్గొనే విభాగాలు
శాంతి భద్రతలు, టాస్‌్కఫోర్స్, ఎస్బీ, సీఏఆర్, సీఎస్‌డబ్ల్యూ, హోంగార్డ్స్, ఇతర జిల్లాల అధికారులు, పొరుగు రాష్ట్రాల పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, టీజీఎస్‌స్పీ, ఏఆర్, సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఆరు యూనిట్ల గ్రేహౌండ్స్, మూడు యూనిట్ల ఆక్టోపస్ బలగాలు అందుబాటులో ఉంటాయి.
పికెట్ల వివరాలు
అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో 310 సమస్యాత్మక ప్రాంతాల్లో 605
మొబైల్ పెట్రోలింగ్ యూనిట్లు: 410
నిఘా కోసం కెమెరాలు
12 వేల కమ్యూనిటీ సీసీ కెమెరాలు, అదనంగా 2 వేల సీసీ కెమెరాలు, 250 అద్దె కెమెరాలతో పాటు మరో 600 హ్యాండ్‌హెల్డ్ కెమెరాలు
సీసీ కెమెరాల కనెక్టివిటీని డీజీపీ కార్యాలయంతో పాటు ఐసీసీసీకి ఇచ్చారు.
బాంబు నిరీ్వర్య బృందాలు: 16
యాక్సెస్ కంట్రోల్ టీమ్స్: 2
పోలీసు జాగిలాలు: 34
అదనపు వైర్‌లెస్ సెట్లు:
600 (ప్రస్తుతం ఉన్నవి 4 వేలు)
డ్రోన్లు: 9
క్రేన్ల మోహరింపు ఇలా
విగ్రహాలను వాహనాలు ఎక్కించడానికి, అవసరమైన చోట్ల వాడటానికి 108 మొబైల్ క్రేన్లు సిద్ధం చేశారు.
కంట్రోల్ రూమ్స్
పాతబస్తీలోని సర్దార్ మహల్‌లో జాయింట్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. దీంతో పాటు కమిషనరేట్, ఎనీ్టఆర్ మార్గ్, గాం«దీనగర్ ఔట్‌పోస్ట్ వద్ద మరో మూడు ఏర్పాటు.