తెలంగాణ: నిరుద్యోగులకు గుడ్‌ న్యూస్‌

3878 Posts Empty In Municipalities In Telangana - Sakshi

పురపాలక శాఖలో 3,878 ఖాళీలు

జీహెచ్‌ఎంసీలో 879.. హెచ్‌ఎండీఏలో 191  

హైదరాబాద్‌ జలమండలిలో 1,951 పోస్టులు ఖాళీ

పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోని అన్ని విభాగాల్లో 3,878 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు తేలింది. పురపాలక శాఖ డైరెక్టరేట్‌ (డీఎంఏ)లో 122, హెచ్‌ఎండీఏలో 191, ప్రజారోగ్య, ఇంజనీరింగ్‌ విభాగం ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) పరిధిలో 432, డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ)లో 233, కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ (కుడా)లో 70, జీహెచ్‌ఎంసీలో 879, హైదరాబాద్‌ జలమండలి (హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ)లో 1,951 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీపై త్వరలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. డీఎంఏ, డీటీసీపీ, పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీ పరిధిలోని ఖాళీ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ద్వారా నియామక ప్రకటనలు రానున్నాయి. జీహెచ్‌ఎంసీ, జల మండలి, హెచ్‌ఎండీఏ, కుడా పరిధిలోని ఖాళీలను శాఖాపరమైన నియామకాల ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.  

పురపాలక శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీ పోస్టుల వివరాలు కేటగిరీల వారీగా..  

దేవాదాయ శాఖలో 128.. 
రాష్ట్ర దేవాదాయ శాఖలో మొత్తం 128 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్‌ (2), అసిస్టెంట్‌ కమిషనర్లు (12), అసిస్టెంట్‌ ఇంజనీర్లు (3), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–1 (4), ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్స్‌ గ్రేడ్‌–3 (81), జూనియర్‌ అసిస్టెంట్స్‌ (16), ఎల్‌డీసీ (1), టైపిస్టు కమ్‌ స్టెనో (9).  
  
వ్యవసాయశాఖలో 761 ఖాళీలు 
సాక్షి, హైదరాబాద్‌: తమ శాఖ పరిధిలోని వివిధ విభాగాల్లో 761 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వ్యవసాయశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించింది. వాటిలో వేర్‌హౌసింగ్‌లో ఎక్కువగా 312 ఖాళీలు ఉన్నాయని పేర్కొంది. ఇతర విభాగాల్లో.. విత్తనాభివృద్ధి సంస్థలో 89, విత్తన, సేంద్రీయ ధ్రువీకరణ సంస్థలో 59, రాష్ట్ర సహకార మార్కెటింగ్‌ ఫెడరేషన్‌లో 51, ఆగ్రోస్‌లో 74, హాకాలో 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వివరించింది.

కేటగిరీ     పోస్టుల సంఖ్య 
పురపాలక శాఖ డైరెక్టరేట్‌ (డీఎంఏ)లో..  
మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–2    26 
మున్సిపల్‌ కమిషనర్‌ గ్రేడ్‌–3    6 
హెచ్‌ఎండీఏలో.. 
జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌    37 
ఏఈఈలు    54 
పబ్లిక్‌ హెల్త్‌ ఈఎన్‌సీలో.. 
ఏఈఈలు    175 
ఏఈలు    75 
టెక్నిల్‌ ఆఫీసర్‌     11 

కేటగిరీ    పోస్టుల సంఖ్య  డీటీసీపీలో.
అడిషనల్‌ డైరెక్టర్‌ టౌన్‌ప్లానింగ్‌    20 
టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌    6 
టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌     175 
ఏఏడీఎం    10 
కుడాలో.. 
జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్స్‌    2 
సర్వేయర్లు    10 
జీహెచ్‌ఎంసీలో... 
టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌ వైజర్లు    200 
వెటర్నరీ ఆఫీసర్లు    31 
సానిటరీ ఇన్‌స్పెక్టర్లు    45 
హెల్త్‌ అసిస్టెంట్లు    44 
ఫీల్డ్‌ అసిస్టెంట్లు    120 
టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్సీర్‌     60 
టౌన్‌ సర్వేయర్లు    30 

కేటగిరీ      పోస్టుల సంఖ్య 
హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీలో.. 

మేనేజర్‌ (ఇంజనీరింగ్‌)    159 
టెక్నిషియన్‌ గ్రేడ్‌–2    72 
జనరల్‌ పర్పస్‌ ఎంప్లాయి (సిబ్బంది)    110 
జనరల్‌ పర్పస్‌ ఎంప్లాయి 
(వాటర్‌ సప్లై జనరల్‌)    1,114 
జనరల్‌ పర్పస్‌ ఎంప్లాయి 
(సివరేజీ జనరల్‌)    297 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top