ఆధ్యాత్మికం అంటే..? | - | Sakshi
Sakshi News home page

ఆధ్యాత్మికం అంటే..?

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

తమిళసినిమా: సంగీత జ్ఞానిగా పేరుగాంచిన ఇళయరాజా తన సంగీతంతో అన్ని వర్గాల వారిని గత అర్ధ శతాబ్దానికి పైగా అలవిస్తూ వస్తున్నారన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయన సంగీతానికి అంతమే లేదని చెప్పవచ్చు. సినిమా పాటలనే కాకుండా అనేక భక్తి రస గీతాలను తన మధురమైన సంగీత భణీలతో ఓలలాడిస్తూ వస్తున్నారు. ఇళయరాజా రాసి న, సంగీత బాణీలు కట్టి రూపొందిన పల్లి ఎళుచ్చి పావై పాడళ్‌ గల్‌ పాటల ఆల్బమ్‌ను సోమవారం సాయంత్రం స్థానిక రాయపేటలోని మ్యూజిక్‌ అకాడమీ ఆవరణలో విడుదల చేశారు. ఇందులో పాల్గొన్న ఇళయరాజా మాట్లాడుతూ తాను 1980 నుంచి తిరువణ్ణామలై గిరి ప్రదక్షిణను చేయడం ఆనవాయితీగా జరుగుతోందన్నారు. తాను గిరి ప్రదక్షిణ చేయడం వల్లే ఆ తర్వాత పలువురు గిరి ప్రదక్షిణ చేయడం మొ దలు పెట్టారని అక్కడ స్వామీజీలు చెబుతుంటారు అన్నారు. అంతేకాకుండా తాను పౌర్ణమి నాడు తిరువణ్ణామలైకు వెళ్లినప్పుడే వర్షం కురుస్తుందని కూడా చెబుతుంటారన్నారు. కాళ్లకు చెప్పులు లేకుండా కాలి బాటనే గిరిప్రదక్షిణ చేస్తానని చెప్పారు.. కాళ్లకు ము ళ్ళు గుచ్చుకున్నప్పుడు పాప పరిహారం అని స్వామీజీలు చెబుతారన్నారు. తాను అక్కడ ఒక శివలింగం వద్ద కూర్చుంటానని అలా ఒకసారి మాణిక్యవాచకం పాడిన పాటలను గుర్తుకు తెచ్చుకుంటానన్నారు. అలా ఇంటికి వచ్చిన మూడు నెలల తరువాత పాడికిడైత్త పరం పొరుళ్‌ అనే పాట మదిలో మెలిగిందన్నారు. ఆ పాటలో తాను రాసిన తమిళ భాషా అనే సందేహం తనకే కలిగిందన్నారు. అది భగవంతుడు ఇచ్చిన సంగీతం అనీ, అసలు సంగీతం అంటేనే దైవత్వం అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement