కోల్‌కత్తాలో కొత్తగా.. | - | Sakshi
Sakshi News home page

కోల్‌కత్తాలో కొత్తగా..

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

తమిళసినిమా: కోలీవుడ్లో ఏస్‌ డైరెక్టర్‌ ఎవరంటే వెంటనే వచ్చే సమాధానం దర్శకుడు మణిరత్నం అనే. సాధారణంగా ఒక్కో దర్శకుడికి ఒక్కో ముద్ర ఉంటుంది. అయితే ఏ తరహా కలనైనా తనదైనశైలిలో తెరపై ఆవిష్కరించి విజయం సాధించగల సత్తా కలిగిన దర్శకుడు మణిరత్నం. ఈయన రోజూ, బొంబాయి వంటి సున్నితమైన ప్రేమ కథా చిత్రాన్ని హృద్యంగా తెరకెక్కించగలరు, దళపతి,నాయకన్‌ వంటి యాక్షన్‌ ఎలిమెంట్స్‌ తో కూడిన కమర్షియల్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ కథా చిత్రాలతోనూ ప్రేక్షకులను ఆకట్టుకోనూ గలరు. అదే విధంగా ఓ కణ్మణి వంటి రోమాంటిక్‌ కథా చిత్రాలతో కురక్రారును అలరించగలరు. పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి చారిత్రాత్మక కథా చిత్రాలను బ్రహ్మాండంగా తెరపై ఆవిష్కరించగలరు. అలాగని మణిరత్నం చేసిన చిత్రాలు అన్నీ హిట్‌ అని చెప్పట్లేదు. ఇటీవల ఆయన చేసిన థగ్‌ లైఫ్‌ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా నిరాశ పరిచింది. దీంతో చిన్న బ్రేక్‌ తీసుకుని మళ్లీ యూత్‌ ఫుల్‌ లవ్‌ స్టొరీతో ప్రేక్షకుల ముందుకు పొందడానికి సిద్ధం అవుతున్నారు. అందుకు ఆయన విజయ్‌ సేతుపతి నటి, సాయి పల్లవి ని ప్రధాన పాత్రధారులుగా ఎంచుకున్నారు. ఈ చిత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా ఇటీవల కోల్‌కత్తాలో షూటింగ్‌ ను ప్రారంభించుకుని అక్కడ ప్రసిద్ధి చెందిన హౌరా బ్రిడ్జి దాని పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్‌ పూర్తి చేసుకునే పనిలో ఉంది చిత్ర యూనిట్‌. అక్కడ ఓ బ్యూటీఫుల్‌ పాటను చిత్రీకరిస్తున్నారు తెలిసింది. మణిరత్నం ఆస్థాన సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఇంకా పేరు నిర్ణయించిన ఈ చిత్రాన్ని మణిరత్నంకు చెందిన మద్రాస్‌ టాకీస్‌,లైకా ప్రొడక్షన్స్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. కాగా ఈ చిత్రం కోసం విజయ్‌ సేతుపతిని, సాయి పల్లవిని మణిరత్నం పూర్తిగా మార్చేశారు. ముఖ్యంగా మీసం, గడ్డాలతో ముదురుగా కనిపించే విజయ్‌ సేతుపతిని యంగ్‌గా చూపించే ప్రయత్నం చేస్తు న్నారు. ఇది యూత్‌ ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా ఉంటోందని పిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement