ప్రభుత్వానికి మద్దతుగా డిస్ట్రిక్ట్‌12 | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి మద్దతుగా డిస్ట్రిక్ట్‌12

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

కొరుక్కుపేట: రాష్ట్ర ప్రభుత్వ పెరంబూర్‌ 2.0 కార్యక్రమానికి మద్దతుగా ఎంఎస్‌ఎంఈ రంగం కోసం ఎస్‌పీఆర్‌ ఇండియా ’డిస్ట్రిక్ట్‌12’ స్మార్ట్‌ ఆఫీస్‌ స్పేస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ముఖ్య అతిథిగా తమిళనాడు వణిగర్‌ సంఘం పెరమైప్పు రాష్ట్ర అధ్యక్షులు ఎ.ఎం. విక్రమ్‌ రాజా , ఇతర ప్రముఖులు పరిశ్రమ నాయకుల సమక్షంలో ప్రారంభోపన్యాసం చేశారు. ‘డిస్ట్రిక్ట్‌12‘ అనే స్మార్ట్‌–ఆఫీస్‌ స్పేస్‌ ప్రారంభోత్సవానికి చైన్నె నలుమూలల నుండి ఎంఎస్‌ఎంఈలు, చిన్న వర్ధమాన ఐటీ, ఐటీఈఎస్‌ కంపెనీలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు, పెట్టుబడిదారులు వ్యాపార యజమానుల నుండి అద్భుతమైన స్పందన లభించింది. ఈ ప్రారంభోత్సవానికి వ్యాపారం, క్రీడలు, వినోదం, న్యాయం , జీవనశైలి రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. మాజీ క్రికెటర్‌ , వ్యాఖ్యాత అనిరుద్ధ శ్రీకాంత్‌, బిగ్‌ బాస్‌ తమిళ ఫేమ్‌ సంయుక్త డిస్ట్రిక్ట్‌ 12ను ప్రత్యేకంగా సందర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement