త్వరలో ప్యార్‌.. ప్రేమ.. కల్యాణం | - | Sakshi
Sakshi News home page

త్వరలో ప్యార్‌.. ప్రేమ.. కల్యాణం

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

తమిళసినిమా: కొన్ని చిత్రాల పేర్లే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి చిత్రమే త్వరలో తెరపైకి రానుంది. దీని పేరు ప్యార్‌ ప్రేమ కల్యాణం. ఓడి పోయ్‌ కల్యాణం పండ్రదా? ఇల్లై కల్యాణం పన్నిట్టు ఓడి పోరదా? ( పారిపోయి పెళ్లి చేసుకునేదా ? లేక పెళ్లి చేసుకుని పారిపోయేదా?) అనే ఆసక్తికరమైన కథాంశంతో రూపొందిన ఈ ద్వారా దర్శకుడు ఇళన్‌ కథానాయకుడిగా అవతారం ఎత్తారు. ఈయన ఇంతకుముందు హరీష్‌ కళ్యాణ్‌ ,రైసా విల్సన్‌ జంటగా ప్యార్‌ ప్రేమ కాదల్‌ చిత్రంతోపాటు కవిన్‌ హీరోగా స్టార్‌ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే స్టార్‌ చిత్రం ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో తాజాగా ఆ చిత్ర దర్శకుడు ఇళన్‌ హీరోగా అవతారమెత్తి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ప్యార్‌ ప్రేమ కల్యాణం.. ఇందులో కుటుంబస్తన్‌ చిత్రం శాన్వి మేఘ్నా నాయకిగా నటించారు. కుటుంబ నేపథ్యంలో సాగే వినోదభరిత కథాచిత్రంగా రూపొందిన ఈ చిత్రం గురించి మీడియా ప్రకటనలో యూనిట్‌ వర్గాలు పేర్కొంటూ పెళ్లి చేసుకున్న తర్వాత కథానాయకి భక్తులతో కలిసి అత్తారింటికి దారేది నిరాకరిస్తుంది అన్నారు .దీంతో కథానాయకుడు పిల్లలకు వస్తానన్నారు ఆ తర్వాత జరిగే కుటుంబ గలాటానే ఈ చిత్రం అన్నా రు. సాంప్రదాయాలు, గొడవలు, కుటుంబంలో సమస్యలు భావిద్రేకాంత పోయిన తరంగాలు నవ్వులు ఆలోచనలు కలిసిన చక్కని పయనమే ఈ చిత్రం అని పేర్కొన్నారు. చివరిగా ఆనందంగా జీవించడానికి విధి విధానాలను ఇతరులు నిర్ణయించాల్సిన అవసరం లేదని చెప్పే చక్కని సందేశం తో కూడిన చిత్రం ఇది అని చెప్పారు. ఇందులో నటి రాధిక శరత్‌ కుమార్‌, యోగిబాబు, ఎమ్మెస్‌ భాస్క ర్‌, గీతా కై లాసం, ఇళంగో కుమరవేల్‌, సెంథిల్‌, మారనచ, టిప్స్‌ సైరస్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కాగా శ్రీనిధి సాగర్‌, రైజ్‌ ఈస్ట్‌ ఎంటర్‌ టైన్మెంట్‌ సంస్థ నిర్మించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టులో నేరుగా నెట్‌ ఫ్లిక్స్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కు సిద్ధం అవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement