14 ఏళ్ల బాలికకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి | - | Sakshi
Sakshi News home page

14 ఏళ్ల బాలికకు మిట్రల్‌ వాల్వ్‌ మార్పిడి

Jul 29 2026 12:46 AM | Updated on Jul 29 2026 12:46 AM

● ఓపన్‌ హార్ట్‌ సర్జరీ ద్వారా నిర్వహణ

సాక్షి, చైన్నె: తీవ్రమైన మిట్రల్‌ వాల్వ్‌ సమస్యతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ, మంచానికే పరిమితమైన 14 ఏళ్ల బాలికకు ఎంజీఎమ్‌ హెల్త్‌కేర్‌ వైద్యులు అత్యంత సంక్లిష్టమైన మిట్రల్‌ వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ శస్త్రచికిత్సను విజయవంతం చేశారు. ఈ బాలిక తీవ్రమైన మిట్రల్‌ రెగర్జిటేషన్‌ , లెఫ్ట్‌ వెంట్రిక్యులర్‌ ఆవుట్‌ ఫ్లో ట్రాక్ట్‌ అడ్డంకితో బాధపడుతున్నట్టు వైద్యులు గుర్తించారు. పాడైపోయిన మిట్రల్‌ వాల్వ్‌ వలన రక్తం శరీరం నలుమూలలకు పంప్‌ కావడానికి బదులుగా వెనక్కి ఎడమ కర్ణికలోకి లీక్‌ అవుతున్నట్టు పరిగణించారు. దీంతో గుండైపె తీవ్రమైన ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడం కష్టంగా మారి ఉండటం, గుండె రక్తనాళాల మార్గంలో ఇరుకు ఏర్పడటం వలన పరిస్థితి మరింత జటిలంగా మారడంతో ఈ శస్త్రచికిత్స ద్వారా పాడైన వాల్వ్‌ను తొలగించి కొత్తది అమర్చడం ద్వారా గుండెలో రక్త ప్రసరణను పునరుద్ధరించారు. తొలుత రోగికి ఉన్న రెండు అరుదైన వైద్య పరిస్థితుల కారణంగా అనేక ఆసుపత్రులు ఈ శస్త్రచికిత్స చేయడానికి నిరాకరించాయి. గుండె సాధారణంగా ఉండాల్సిన ఎడమ వైపు కాకుండా ఛాతీ మధ్యభాగంలో ఉండే మెసోకార్డియా అనే అరుదైన జన్మనిర్మిత సమస్య ఈ చిన్నారికి ఉండటం గమనార్హం. ఈ విలక్షణమైన అమరిక వల్ల మిట్రల్‌ వాల్వ్‌ను చేరుకోవడం వైద్యులకు సవాలుగా మారింది. దీనికి తోడు, బాలిక మోర్కియో సిండ్రోమ్‌ అనే అరుదైన జన్యు సంబంధిత జీవక్రియ లోపంతో బాధపడుతోంది. దీంతో ఎముకలలో వైకల్యం ఏర్పడి, మెడ ఎముకలు స్థిరత్వాన్ని కోల్పోవడంతో అనస్థీషియా సమయంలో ఇది తీవ్ర ప్రమాదకరమైనది కావడం వస్స మెడ భాగానికి ఎలాంటి హాని జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. పీడియాట్రిక్‌ కార్డియాక్‌ అండ్‌ హార్ట్‌ – లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సీనియర్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ ఆర్‌.కె.ఆర్‌ నవీన్‌ డేవిడ్సన్‌ ఈ ఓపెన్‌ హార్ట్‌ సర్జరీని నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement