– 50 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం
తిరువళ్లూరు: తిరువళ్లూరు జిల్లా మురుగంజేరి వద్ద రోడ్డుకు ఒడ్డును వున్న విద్యుత్‌స్తంభాన్ని లారీ ఢీకొట్టడంతో స్థంభం కూలిపోయింది. ఈ ప్రమాధంలో మూడు ద్విచక్ర వాహనాలకు పాక్షికంగా దెబ్బతినగా, అదృష్టవశాత్తు ప్రాణాపాయం నష్టం కలగలేదు. అయితే స్తంఽంభం కూలిన క్రమంలో 50 గ్రామాలకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. తిరువళ్లూరు ఇజల్లా మురుగంజేరి వద్ద తిరుపతి–చైన్నె జాతీయ రహదారి ఒడ్డున హైఓల్టేజ్ విద్యుత్ స్తంభం ఉంది. ఈ స్తంభాన్ని చైన్నె నుంచి తిరువళ్లూరు వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. దీంతో విద్యుత్ స్తంభం కుప్పకూలి రోడ్డులో పడింది. అయితే స్తంభం కూలిన క్రమంలో రోడ్డులో వెళ్తున్న ద్విచక్ర వాహనంపై పడింది. అయితే అదృష్టవశాత్తూ ప్రాణాపాయం కలగలేదు. విద్యుత్ స్తంభం ద్విచక్ర వాహనంపై పడడంతో వాహనచోదరకులు భయంతో పరుగులు పెట్టారు.


