మేమంతా ఒకే గూటి పక్షులే.. | - | Sakshi
Sakshi News home page

మేమంతా ఒకే గూటి పక్షులే..

Jul 28 2026 2:06 AM | Updated on Jul 28 2026 2:06 AM

తమిళసినిమా: గుడ్‌నైట్‌, లవర్‌, టూరిస్ట్‌ ఫ్యామిలీ వంటి చిత్రాలను నిర్మించిన మిలియన్‌ డాలర్స్‌ సంస్థతో కలిసి నియో క్యాస్టిల్‌ క్రియేషన్స్‌,ఇరా ఎంటర్‌ టైన్మెంట్‌ సంస్థల అధినేతలు సత్య కరికాలన్‌,ఇరా శరవణన్‌, యువరాజ్‌ గణేశన్‌ కలిసి నిర్మించిన తాజా చిత్రం అన్బే డయానా. పారి ఇళవళగన్‌ కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన కథానాయకుడిగా నటించిన ఇందులో నటి రమ్య రంగనాథన్‌, నటి రోజా, చేతన్‌, పరితాపంగళ్‌ గోపి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. భరత్‌ శంకర్‌ సంగీతాన్ని అందించారు.ఈ నెల 17వ తేదీన తెరపైకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల ఆదరణతో ప్రదర్శింపడుతుండటంతో థ్యాంక్స్‌ గివింగ్‌ కార్యక్రమాన్ని సోమవారం మధ్యాహ్నం చైన్నెలోని ప్రసాద్‌ ల్యాబ్‌ లో నిర్వహించారు.ఈ వేదికపై నిర్మాతలలో ఒకరైన సత్య కరికాలన్‌ మాట్లాడుతూ విద్యారంగం నుంచి వచ్చిన తనకు అన్బే డయానా చిత్రం మంచి అనుభవాన్నిచ్చిందన్నారు. ఇందుకు కారణం అయిన నిర్మాతలు ఇలా శరవణన్‌, యువరాజ్‌ గణేశన్‌ లకు ధన్యవాదాలు అన్నారు. తామంతా ఒకే గూటి పక్షులమేననీ, మరిన్ని మంచి చిత్రాలు కలిసి చేస్తామని చెప్పారు. విజయాన్ని పక్కన పెట్టి పారిఇళవళగన్‌ హీరోగా నిలబడాలన్న ఇంటెన్సివ్‌ తో రూపొందించిన అన్బే డయానా అని, అది ఇప్పుడు నెరవేరిందని నిర్మాత యువరాజ్‌ గణేశన్‌ పేర్కొన్నారు. నటి రోజా ఈ చిత్రం లో నటించడానికి అంగీకరించడమే పెద్ద బలం అదే విధంగా మ్యాజిక్‌ పాత్రలో నటించిన హీరోయిన్‌ రమ్య రంగనాథన్‌ చాలా బాగా నటించారనీ, అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్లు దర్శకుడు, కథానాయకుడిగా పారి ఇళవళగన్‌ పేర్కొన్నారు. చిత్ర నిర్మాతలకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement