విరాటపర్వం ఎంతో ప్రత్యేకం | - | Sakshi
Sakshi News home page

విరాటపర్వం ఎంతో ప్రత్యేకం

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

కొరుక్కుపేట: మహా భారతంలో విరాట పర్వానికి ఎంతో ప్రత్యేకత ఉందని ద్విశతావధాని, అవధాన విద్వన్మణి డాక్టర్‌ బులుసు అపర్ణ అన్నారు. వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో తరతరాల తెలుగు కవిత ఉపన్యాస ధారావాహిక 175వ ప్రసంగం విరాటపర్వం –తిక్కన నాటకీయత పై ఆదివారం రాత్రి ఉపన్యాసం జరిగింది. దీనికి చైన్నె టి.నగర్‌ లోని ఆస్కా కృష్ణా హాలు వేదికై ంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ద్విశతావధాని, అవధాన విద్వన్మణి డాక్టర్‌ బులుసు అపర్ణ వక్తగా విచ్చేసి విరాటపర్వం –తిక్కన నాటకీయత పై ఉపన్యసిస్తూ.. మహా భారతంలో విరాట పర్వంకి ఎంతో ప్రత్యేకత ఉందని పేర్కొన్నారు. విరాటపర్వాన్ని తిక్కన గొప్పగా రచించారని తెలిపారు. వేద విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జేకే రెడ్డి కొన్ని పద్యాలు పాడి అందరినీ అలరించి, వక్త అపర్ణను సభకు పరిచయం చేశారు.డా. బులుసుఅపర్ణ 17 ఏళ్ల ప్రాయంలోనే అష్టావధానం చేయడం ప్రారంభించి 300 పైగా అష్టావధానాలు చేయడం గర్వకారణమని కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement