ఎం.కన్నన్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ఎం.కన్నన్‌ మృతి

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

ఎం.కన్నన్‌ మృతి అనుమానస్పద స్థితిలో డీఎంకే కార్యకర్త మృతి పగిలిన గ్యాస్‌ పైప్‌లైన్‌ ఎర్రచందనం కేసులో ఒకరికి ఐదేళ్లు జైలు

కొరుక్కుపేట: రోటరీ క్లబ్‌ గవర్నర్‌, మాజీ కౌన్సిల్‌ సభ్యుడు ఎం. కన్నన్‌ ఇకలేరు. ఈ విషయం తెలుసుకున్న తమిళ మానిళ కాంగ్రెస్‌ (టీ ఎం సి) పార్టీ అధ్యక్షుడు జి.కె. వాసన్‌, టీఎంసీ ప్రధాన కార్యదర్శి జి.ఆర్‌. వెంకటేష్‌, ఏఐఏడీఎంకే ఆర్గనైజేషన్‌ సెక్రటరీ రాయపురం ఆర్‌. మనో, రోటరీ టి. రాజేశ్వరన్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీధర్‌, లూయిస్‌ రాజన్‌, కళ్యాణి,మారి తదితరులు కన్నన్‌ పార్ధీవదేహానికి పూలమాలలు వేసి సంతాపం తెలియజేశారు.

తిరుత్తణి: అనుమానస్పద రీతిలో డీఎంకే కార్యకర్త మృతిపట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తిరుత్తణి నుంచి పొదటూరుపేటకు వెళ్లు రాష్ట్ర రహదారిలో బుచ్చిరెడ్డిపల్లె వద్ద సోమవారం వేకువజామున వ్యక్తి తల నలిగిన స్థితిలో మృతదేహం రోడ్డుకు పక్కలో పడివుండడం గుర్తించిన అటువైపు వెళ్లిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరుత్తణి పోలీసులు సంఘటనా ప్రాంతం చేరుకుని మృతేహం చేపట్టి పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో పొదటూరుపేటకు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు రజినీ(48) డీఎంకే కార్యకర్తగా తెలిసింది. అరక్కోణం ప్రాంతంలో బందువుల ఇంటి వేడుకల్లో పాల్గొని ఆదివారం రాత్రి బైకులో ఇంటికి వెళ్తుతుండగా అనుమానస్పద రీతిలో మృతి చెందినట్లు పోలీసుల ప్రాధమిక విచారణలో తెలిసింది. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడా లేక హత్యకు గురియైయాడా అన్న కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

తిరువల్లూరు: రోడ్డు విస్తరణ పనుల కోసం జరిగిన తవ్వకాల నేపథ్యంలో గ్యాస్‌ పైప్‌ లైన్‌ పగిలి లీకేజీ గురి కావడం తీవ్ర కలకలం సష్టించింది. తిరువళ్లూరు జిల్లా పుదు సత్రం సమీపంలో తిరుపతి –చైన్నె రోడ్డు విస్తరణ పనుల కోసం జెసిబి యంత్రం ద్వారా రోడ్డుకి ఇరువైపులా తవ్వకాలను చేస్తున్నారు. పనులు నిర్వహిస్తున్న సమయంలో గ్యాస్‌ లైన్‌ పైపు హఠాత్తుగా పగిలి లీకేజీ ఏర్పడింది. దీంతో వాసన రావడంతో పాటు శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో అప్రమత్తమైన అధికారులు సమీపంలోని అగ్ని మాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది గ్యాస్‌ లీకేజీ జరిగిన ప్రాంతంలో నీటిని చల్లారు. అనంతరం పైప్‌లైన్‌ తగిన ప్రాంతానికి సమీపంలోని కనెక్షన్‌ వద్ద మూసివేసి, సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

తిరుపతి లీగల్‌: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో తమిళనాడు, తిరువణ్ణామలై జిల్లా, పోలూరు తాలూకా, మంగళాపురానికి చెందిన పీ.సురేష్‌కు ఐదేళ్లు జైలు శిక్ష విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్‌ జడ్జి నరసింహమూర్తి తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ కథనం మేరకు ...ఎర్రచందనం అక్రమ నిరోధక దళం 2018లో నమోదు చేసిన కేసులో విచారణ అనంతరం న్యాయమూర్తి తీర్పుచ్చినట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement