ప్రజాక్షేత్రంలో పతనం కావడం ఖాయం | - | Sakshi
Sakshi News home page

ప్రజాక్షేత్రంలో పతనం కావడం ఖాయం

Jul 28 2026 1:48 AM | Updated on Jul 28 2026 1:48 AM

● ఉదయనిధి స్టాలిన్‌ ఆగ్రహం

సాక్షిచ, చైన్నె: విమర్శలు చేసినంత మాత్రాన అరెస్టులకు పాల్పడుతున్న పాలకులు కోర్టులలో మొట్టికాయలు తినడమే కాకుండా, ప్రజాక్షేత్రంలోనూ ఘోర పరాజయాన్ని చవిచూడటం ఖాయమని ప్రతిపక్ష నేత, డిఎంకె యువజన నాయకుడు ఉదయనిధి స్టాలిన్‌ విమర్శించారు. పాలయంకోటై సెంట్రల్‌ జైలులో నిర్బంధంలో ఉన్న డిఎంకె ఎమ్మెల్యే మార్కండేయన్‌ను సోమవారం పరామర్శించిన అనంతరం ఆయన స్పందిస్తూ, నిరంకుశత్వంతో కూడిన ప్రభుత్వ పగటిపూట కక్షసాధింపు చర్యల్లో భాగంగా అరెస్ట్‌ అయిన దమ ఎమ్మెల్యే మార్కండేయన్‌ను పాలయంకోటై సెంట్రల్‌ జైలులో కలవడం జరిగిందన్నారు. జైలులో ఉన్నప్పటికీ ఆయన మునుపటి కంటే అత్యంత ఉత్సాహంతో, ప్రజా సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.

చట్టపరమైన పోరాటం

డీఎంకే అధ్యక్షుడు ఎం.కె.స్టాలిన్‌ మార్గదర్శకత్వంలో లాయర్లు చేపడుతున్న బెయిల్‌, చట్టపరమైన చర్యల వివరాలను ఆయనకు వివరించి ధైర్యం చెప్పినట్లు తెలిపారు. డీఎంకే అనేది మిసా, ఎమర్జెన్సీ కాలాలనే ధైర్యంగా ఎదుర్కొన్న పార్టీ అని, అనుకోకుండా అధికారంలోకి వచ్చి విచక్షణారహితంగా పాలిస్తున్న ఈ ప్రభుత్వం చేసే అరెస్టులకు డీఎంకే చివరి కార్యకర్త కూడా భయపడడని ఈ సందర్భంగా ఉదయనిధి హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement