సాక్షి ,చైన్నె: రోటరీ క్లబ్ ఆఫ్ మద్రాస్ కాస్మోస్ 2026–27 సంవత్సరానికి కొత్త అధ్యక్షుడిగా ఆదర్శ్ బెటాలా బాధ్యతలు స్వీకరించారు. దీంతో ఆయన రోటరీ క్లబ్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన అధ్యక్షుడిగా నిలిచారు. కేవలం 27 ఏళ్ల వయస్సులోనే, ఆదర్శ్ నూతన ఆవిష్కరణలు, ప్రభావవంతమైన సేవతో నడిచే రోటరీ నాయకత్వంలోని కొత్త తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు . క్లబ్ కార్యదర్శిగా బాధ్యతలు రొటేరియన్ బింధ్య ఆయనకు సమర్థవంతంగా మద్దతు ఇస్తారు , అదే సమయంలో ప్రథమ మహిళ కోమల్ బెటాలా రోటరీ సంవత్సరం పొడవునా క్లబ్ సేవా కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలను ముందుకు నడిపించడంలో అధ్యక్షుడికి తోడుగా నిలువనున్నారు. ప్రముఖ రోటేరియన్లు, ప్రముఖులు, కార్పొరేట్ నాయకులు, శ్రేయోభిలాషుల సమక్షంలో జరిగిన ప్రతిష్ఠాపన కార్యక్రమానికి పిడిజి రొటేరియన్ మహావీర్ బోత్రా ముఖ్య అతిథిగా , మహమ్మద్ ఆసిఫ్ అలీ గౌరవ అతిథిగా విచ్చేశారు.. ఈ సందర్భంగా మిషన్ 35 పేరుతో సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.


