కొరుక్కుపేట: ఎన్‌ఎల్‌సీ ఇండియా లిమిటెడ్ మాజీ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్న కుమార్ మోటుపల్లికి ప్రతిష్టాత్మక గ్లోబల్ ఎక్సలెన్సీ అవార్డు వరించింది. చైన్నెలో ఆదివారం జరిగిన నేషనల్ కన్వెన్షన్ ఆన్ బోర్డ్స్ 2026లో భాగంగాయూఏఈకి చెందిన ట్రైస్టార్ గ్రూప్ సహకారంతో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ (ఐఓడీ)– ఇండియా నిర్వహించిన ఐ ఓ డి గ్లోబల్ సన్మాన కార్యక్రమంలో, ఐడియల్ అవార్డులతో పాటు ఐఓడి గ్లోబల్ ఎక్సలెనన్స్ అవార్డును ప్రదానం చేసి సత్కరించారు. పరివర్తన యుగం కోసం అత్యుత్తమ పనితీరు కనబరిచే బోర్డులను నిర్మించడంఅనే అంశంపై ప్రసన్న కుమార్ మోటుపల్లి విశిష్ట వక్తగా పాల్గొని మాట్లాడారు. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రదానం చేశారు. కార్యక్రమంలో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి , ఇనన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ జాతీయ ఛైర్మన్ జస్టిస్ యు.యు. లలిత్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ జాతీయ వైస్–ఛైర్మన్ జస్టిస్ రితు రాజ్ అవస్థి, సీనియర్ ప్రభుత్వ అధికారులు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కార్పొరేట్ వర్గ సభ్యులు పాల్గొన్నారు.


