కట్టా కుస్తీ చిత్ర దర్శకుడితో.. | - | Sakshi
Sakshi News home page

కట్టా కుస్తీ చిత్ర దర్శకుడితో..

Jul 27 2026 12:36 AM | Updated on Jul 27 2026 12:36 AM

తమిళసినిమా: ఇటీవల వేరు వేరు చిత్రాలతో మంచి విజయాన్ని అందుకున్న దర్శకుడు, నటుడు కలిసి పని చేయడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. విష్ణు విశాల్‌ హీరోగా కట్టా కుస్తీ 1,2 చిత్రాలను రూపొందించి మంచి విజయాలను అందుకున్న దర్శకుడు సెల్లా అయ్యావు. అదేవిధంగా తొలిసారిగా కథానాయకుడిగా నటించి దర్శకత్వం వహించి ఘనవిజయాన్ని అందుకున్న దర్శకుడు కెన్‌ కరుణాస్‌. కథానాయకుడిగా నటించి, దర్శకత్వం వహించిన యూత్‌ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో పాటు విమర్శకుల ప్రశంసలను అందుకుంది. దీంతో కెన్‌ కరుణాస్‌ తదుపరి చిత్రం ఏమిటి అన్న ఆసక్తి నెలకొంది. దీనికి సమాధానంగా ఆయన తన తదుపరి చిత్రాన్ని వెట్రిమారన్‌ దర్శకత్వం వహించి నున్న రాజన్‌ వగైయరా చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కట్టాకుస్తి చిత్రం సెల్లా అయ్యావు దర్శకత్వంలోనూ కెన్‌ కరుణాస్‌ హీరోగా నటించడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలిసింది. కట్టా కుస్తీ –2 చిత్రంలో కీలకపాత్రను పోషించిన నటుడు కరుణాస్‌కు దర్శకుడు సెల్లా అయ్యావు తో మంచి స్నేహం ఏర్పడిందని, దీంతో ఆయన దర్శకత్వంలో తన కొడుకు కెన్‌ కరుణాస్‌ హీరోగా నటుడు కరుణాస్‌ చిత్రాన్ని నిర్మించడానికి సమాచారం. ఈ చిత్రానికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే దీని గురించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement