కొరుక్కుపేట: చైన్నె తెలంగాణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ ప్రజల ఆధ్యాత్మికత, సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఆదివారం ఘనంగా జరుపుకోనున్నారు. ఉదయం 9.30గంటలకు షావుకారుపేట సమీపంలోని మింట్ రేణుకా పరమేశ్వరి (చిన కడమ్మన్) ఆలయం నుంచి ప్రారంభమమైన బోనాల ఊరేగింపు కొండితోపు పార్కు సమీపం రాతినమ్ వీధిలో ఉన్న ఆదిశక్తి ఆలయాన్ని చేరుకుంది. కుల, మతాలకతీతంగా నగరంలోని పలుప్రాంతాల్లో నివశిస్తున్న తెలంగాణ ఆడ పడుచులు, ఒగ్గు కళాకా రులతో జరుపుకోనున్న ఈ బోనాల పండుగలో అమ్మవారి ఆశీస్సులు పొందుకున్నారు. సంప్రదాయ దుస్తుల్లో పాల్గొన్న మహిళలు బోనాలు సమర్పించగా, చిన్నారులు, యువత సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు డి.అంజయ్య, ఎం.పరుశురాములు, ఎస్ కె షఫి, ఎం.రమేష్, సీహెచ్ గిరి, సీహెచ్ నరసింహ, ఎన్.అశోక్, జంపయ్య, రాజు, జానకిరామ్, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొని బోనాలు పండుగను విజయవంతం చేశారు.


