వేదికగా అపూర్వ కలయిక
తిరుత్తణి: ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్ధులు నాలుగు దశాబ్దాల తర్వాత కలిశారు. తిరువలంగాడు యూనియన్‌లోని కనకమ్మసత్రం ప్రభుత్వ మహాన్నత పాఠశాలలో 1984–87 విద్యా సంవత్సరాల్లో తెలుగు మీడియంలో టెన్త్, ప్లస్‌టూ చదువుకున్న 60 మంది పూర్వ విద్యార్థుని, విద్యార్ధులు పాఠశాల చదువు పూర్తి చేసుకుని పై చదువులు చదవి దేశ విదేశాల్లో ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం ఆరు వసంతాలు నిండిన వారంతా కుటుంబాలతో సంతోష జీవితం గడుపుతున్నారు. చదువుకున్న బడి, పాఠాలు నేర్పిన ఉపాధ్యాయుల చొరువతో మంచి స్థితికి చేరుకున్న వారు తమ బడిలో కలుసుకుని, గురు వందనం చేయాలని నిర్ణయించి మూడు నెలలుగా బడి మిత్రులను అన్వేషించి వాట్సాప్ ద్వారా ఒక్కటైయ్యారు. దీంతో ఆదివారం పాఠశాల వేదికగా అపూర్వ కలయిక వేడుకకు పాఠశాల వేదికై ంది. విద్యార్థి దశలో విడిపోయి జీవిత చరమాంకంలో కలుసుకోవడం వారిలో అమితానందం నింపింది. విద్య నేర్పిన ఉపాధ్యాయులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు పొందారు. పాఠశాలకు తమంతుగా రూ. 1.50 లక్షల విలువైన గ్రిల్ అందజేశారు.


