సాక్షి, చైన్నె : హెచ్‌ఐటీఎస్ ఫ్యాషన్ డిజైన్ విభాగంలో వార్షిక గ్రాడ్యుయేషన్ ఫ్యాషన్ షో రాజిల్ దాజిల్ 12.ఓ పేరిట పడూర్‌లో నిర్వహించారు. ఎంజీఆర్ ఆడిటోరియంలో ఐదు గంటల పాటు సాగిన ఈ వేడుకకు 300 మందికి పైగా పరిశ్రమ ప్రముఖులు, విద్యావేత్తలు, వ్యాపారవేత్తలు , ఫ్యాష న్ ప్రేమికులు తరలి వచ్చారు. చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు రూపొందించిన వివిధ డిజైన్లను ఏడు ప్రధాన ర్యాంప్ వాక్‌లలో ప్రదర్శించారు. వీటితో పాటు పలువురు ప్రముఖులు, పరిశ్రమ నిపుణులు ప్రత్యేక షోకేష్ వాక్‌లలో సందడి చేశారు. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ విజన్ ఎక్‌స హెడ్ డాక్టర్ కౌస్తవ్ సేన్‌గుప్తా విద్యార్థులు సరికొత్త భావనలతో, సృజనాత్మకంగా డిజైన్ చేసిన వస్త్రాలను వీక్షించి అభినందించారు. సరికొత్త శైలులు, వినూత్న రంగుల కలయికతో విశిష్టమైన డిజైన్లను రూపొందించడంలో విద్యార్థుల కృషిని కొనియాడారు.ఇండియన్ టెర్‌సైన్ బిజినెస్‌ఆఫీసర్ షెహనాజ్ షెరీఫ్, ఆ విద్యా సంస్థ ప్రో ఛాన్సలర్ డాక్టర్ అశోక్ జార్జ్ వర్గీస్, ఫ్యాషన్ విభాగం అధిపతి డాక్టర్ అనీష్ షర్మిల మాట్లాడుతూ తమ డిజైన్ ప్రక్రియలో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌ను అనుసంధానిస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా, కేసీజీ ఫ్యాషన్ బ్యాంక్ అనే కార్యక్రమం ద్వారా పాత వస్త్రాలను రీసైకిల్ చేసి, కొత్త దుస్తులుగా మార్చి ఎన్‌జీఓ ల సహాయంతో పేదలకు అందిస్తున్నామని, దీని ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గిస్తున్నామని తెలిపారు.ఈకార్యక్రమం ముగింపులో ప్రతిభ చూపిన విద్యార్థులకు పురస్కారాలు అందించారు.


