లారీ నడుపుతుండగా
గుండెపోటు
– డ్రైవర్ మృతి
తిరువొత్తియూరు: శ్రీపెరంబుదూర్ సమీపంలో లారీ నడుపుతుండగా హఠాత్తుగా గుండెపోటు రావడంతో, ప్రమాదాన్ని నివారించేందుకు లారీని సురక్షితంగా రోడ్డు పక్కన నిలిపివేసి డ్రైవర్ ప్రాణాలు విడిచారు. తిరువళ్లూర్ జిల్లా పూందమల్లి సమీపంలోని చెంబరంబాక్కం గ్రామానికి చెందిన హరిసెల్వం (55). ఈయ న శ్రీపెరంబుదూర్ సిప్కాట్ పారిశ్రామిక ప్రాంతంలోని ఓ ప్రైవేట్ సంస్థ నుండి పెయింట్ డబ్బాలను లోడ్ చేసుకుని తన లారీని నడు పుకుంటూ వెళ్తున్నారు. చెంగల్పట్టు – శ్రీపెరంబుదూర్ రోడ్డులో ప్రయాణిస్తూ పొందూర్ సమీపంలోకి రాగానే ఆయనకు తీవ్రమైన గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో బాధపడుతున్నప్పటికీ, డ్రైవర్ సెల్వం సమయస్ఫూర్తితో వ్యవహరించి లారీని రోడ్డు పక్కన సురక్షితంగా ఆపారు. తర్వాతి కొద్ది నిమిషాల్లోనే సెల్వం డ్రైవర్ సీట్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఆయ నతో పాటు ప్రయాణిస్తున్న క్లీనర్/సహాయకు డు ఎళిలరసన్ వెంటనే శ్రీపెరంబుదూర్ పోలీ సు స్టేషన్‌కు సమాచారం అందించారు. పోలీసులు సెల్వం మతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఎలక్ట్రిక్ రైలు
సేవల్లో మార్పులు
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ నుంచి గూడూరు మార్గంలో ఉన్న గుమ్మిడి పూండి యార్డ్‌లో శుక్రవారం నుండి నిర్వహణ పనులు జరుగుతున్నాయి. ఈ పనులు శనివారం, ఆదివారం కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, గుమ్మిడి పూండి మార్గంలో విద్యుత్ రైలు సర్వీసులో మార్పులు చేశారు. కొన్ని రైలు సర్వీసులను రద్దు చేశారు. రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సిన మోర్ మార్కెట్–గుమ్మిడిపూండి ఎలక్ట్రిక్ రైలు పొన్నేరి – గుమ్మిడిపూండి మధ్య రద్దు చేశారు. రాత్రి 11.20 గంటలకు బయలుదేరాల్సిన మోర్ మార్కెట్ – గుమ్మిడిపూండి ఎలక్ట్రిక్ రైలు పొన్నేరి – గుమ్మిడిపూండి మధ్య రద్దయ్యింది. గుమ్మిపూండి – పొన్నేరి మధ్య రాత్రి 10.30 గంటలకు బయలుదేరాల్సిన గుమ్మిపూండి–మూర్ మార్కెట్ ఎలక్ట్రిక్ రైలు, గుమ్మిడిపూండి నుండి ఉదయం 3.50 గంటలకు బయలుదేరే, గుమ్మిడిపూండి మీంజూర్ మధ్య ఉన్న మూర్ మార్కెట్‌కు చేరుకునే ఎలక్ట్రిక్ రైలును శనివారం, ఆదివారం రద్దు చేశా రు. అలాగే గుమ్మిడిపూండి నుండి ఉదయం 4.50 గంటలకు బయలుదేరే గుమ్మిడిపూండి – పొన్నేరి మధ్య ఉన్నమోర్ మార్కెట్‌కు చేరుకోవలసిన ఎలక్ట్రిక్ రైలును శనివారం, ఆదివారం రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు.
స్పృహ తప్పిపడి
పోలీసు మృతి
అన్నానగర్: చైన్నెలోని కొండితోప్పు పోలీసు క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న పెరుమాల్ స్వస్థలం తూత్తుకుడి ముడివానాథనందల్. ఇతను చైన్నెలోని సెక్యూరిటీ బ్రాంచ్ (ఎస్.సి.బి.)లో పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి చైన్నె వేప్పేరి భద్రతా విభాగం ఆఫీసులో రాత్రిడ్యూటీలో ఉన్న అతని స్నేహితుడు శేషన్ తో పెరుమాళ్ సెల్ ఫోలో మాట్లాడాడు. నేను మీతో మాట్లాడాలి. ఆఫీసు నుండి బయటకు రా అని అతన్ని పిలిచాడు. ఆ తర్వాత, ఇద్దరూ ఆఫీసు బయట నిలబడి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా పెరుమాళ్ హఠాత్తుగా స్పృహ కోల్పోయాడు. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన కానిస్టేబుల్ శేషన్ వెంటనే అంబులెన్స్‌కు ఫోన్ చేసి, అతడిని కిల్పాక్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అతనిని పరిక్షించిన వైద్యులు అతను మరణించినట్లు ప్రకటించారు. అనంతరం, పోలీస్ అధికారి పెరుమాల్‌ను పోస్ట్‌మార్టం గదికి తీసుకువెళ్లారు. మృతుడైన పోలీస్ పెరుమాళ్‌కు వివాహమై భార్య సెంబక వల్లి, దివ్యశ్రీ అనే నాలుగేళ్ల కుమార్తె ఉంది. సెంబగ వల్లి ప్రస్తుతం 9 నెలల గర్భవతి. ఆమెను నెల రోజుల క్రితం ప్రసవం కోసం పుట్టింటికి తీసుకువెళ్లారు. కేవలం 29 ఏళ్ల వయసులోనే మరణించిన పెరుమాళ్ మృతి అతని కుటుంబ సభ్యులను విషాదంలో ముంచింది.
450 కిలోల
గుట్కా అక్రమ రవాణా
– ఇద్దరు ఆంధ్రా వ్యక్తుల అరెస్టు
తిరువళ్లూరు: తమిళనాడు ప్రభుత్వం నిషేదించిన గుట్కాను ఆటోలో తరలించిన చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన ఇద్దరిని ఊత్తుకోట పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి, గుట్కా, మత్తు పధార్దాలను నిషేధించి, రాష్ట్రంలో తీవ్రంగా తనీఖీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తిరువళ్లూరు జిల్లా ఊత్తుకోట తాలుకా పరిదిలో పోలీసులు తనీ ఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఆటోలో అనుమానస్పదంగా వెళ్ళుతున్న ఇద్దరిని అదుపులోకి తీసు కుని తనిఖీ చేశారు. పోలీసుల తనీఖీల్లో ఆటోలో 450 కిలోల గుట్కా వస్తువులు వున్నట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఆటోలో వున్న చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన బషీర్, గణేష్ తదితర ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో వీరిద్దరు ఆంధ్ర నుంచి నిషేధిత గుట్కాను తరలించి తమిళనాడులో విక్రయిస్తున్నట్టు నిర్ధారించిన పోలీసులు వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


