పర్సనలైజ్డ్‌ క్యాన్సర్‌ సంరక్షణపై చర్చలు | - | Sakshi
Sakshi News home page

పర్సనలైజ్డ్‌ క్యాన్సర్‌ సంరక్షణపై చర్చలు

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

● చైన్నెలో క్యాన్సర్‌ సదస్సు

సాక్షి, చైన్నె : క్యాన్సర్‌ చికిత్సారంగంలో సాంప్రదాయ పద్ధతుల నుండి వ్యక్తిగతీకరించిన ఆధునిక చికిత్సల వైపు మార్పు వేగంగా జరుగుతోందని నిపుణులు వ్యాఖ్యానించారు. క్యాన్సర్‌ వైద్యంలో వస్తున్న నూతన పురోగతులపై చర్చించేందుకు భారత్‌ , విదేశాల నుండి 250 మందికి పైగా ఆంకాలజిస్టులు, సర్జన్లు, రేడియేషన్‌ నిపుణులు, పరిశోధకులు చైన్నెలో శనివారం సమావేశమయ్యారు. వీఎస్‌ హాస్పిటల్స్‌ (, వీఎస్‌ మెడికల్‌ ట్రస్ట్‌ సంయుక్తంగా నిర్వహించిన వీఎస్‌ ఇంటర్నేషనల్‌ ప్రిసిజన్‌ ఆంకాలజీ సమిట్‌ –20026 పేరిట మూడు రోజుల పాటుగా ఈ సదస్సు జరగనున్నది. ప్రిసిజన్‌ మీట్స్‌ ప్రోగ్రెస్‌ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. క్యాన్సర్‌ బాధితుల సంఖ్య పెరగడం అతిపెద్ద ఆరోగ్య సవాలుగా మారిన నేపథ్యంలో సాంప్రదాయంగా అందరికీ ఒకే రకమైన చికిత్స విధానాన్ని స్వస్తి చెప్పి, ప్రతి రోగి వ్యాధి లక్షణాలు, డీఎన్‌ఏ ఆధారంగా వ్యక్తిగతీకరించిన ప్రిసిజన్‌ క్యాన్సర్‌ కేర్‌ అందించడంపై ఈ సదస్సు ద్వారా నిపుణులు ప్రాధాన్యతనిచ్చారు మాలిక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌, టార్గెటెడ్‌ థెరపీ, ఇమ్యునోథెరపీ, అడ్వాన్స్డ్‌ రేడియేషన్‌ విధానాలు, రోబోటిక్‌ , మినిమల్లీ ఇన్వేసివ్‌ సర్జరీలు, ఆర్గాన్‌ ప్రిజర్వేషన్‌ వ్యూహాలపై విస్తృతంగా చర్చించారు. ఈ సదస్సులో అసోం క్యాన్సర్‌కేర్‌ సెంటర్‌డైరెక్టర్‌ పద్మశ్రీ డాక్టర్‌ రవి కణ్ణన్‌ , ప్రోగ్రామ్‌ ఆర్గనైజింగ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ . సుబ్రమణియన్‌, వీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ హాస్పిటల్‌స మెడికల్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుందర్‌, ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌ ముత్తు సుబ్రమణియన్‌ , ప్రోగ్రామ్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ డాక్టర్‌ విజయ్‌ , వీఎస్‌ గ్రూప్‌ సీఓఓ ప్రసన్న శ్రీనివాసన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement