ఒరెండ అంటున్నా సుశీగణేశన్‌..! | - | Sakshi
Sakshi News home page

ఒరెండ అంటున్నా సుశీగణేశన్‌..!

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

తమిళసినిమా: సినిమాకు పబ్లిసిటీనే ప్రాణం అన్న విషయం తెలిసిందే. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావాలంటే చిత్రానికి ఒక అట్రాక్షన్‌ అవసరం. దాన్ని క్రియేట్‌ చేసేది పబ్లిసిటీ. చిత్రంలోని ఏదో ఒక ముఖ్య అంశంతో దర్శక నిర్మాతలు హైప్‌ తీసుకురావడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి యుక్తిని ప్రదర్శించడంలో దర్శకుడు సుశీ గణేశన్‌ దిట్ట. ఫైవ్‌స్టార్‌ చిత్రంతో దర్శకుడిగా అవతారమెత్తిన ఈయన ఆ తర్వాత విరుంబుగిరేన్‌, తిరుట్టు పేర్లే, కందసామి, తిరుట్టుపయలే 2 వంటి వైవిధ్య భరిత కథా చిత్రాలను తెరకెక్కించారు. ఆ తర్వాత బాలీవుడ్కు వెళ్లారు కాగా తాజాగా సుమారు 9 ఏళ్ల తర్వాత మళ్లీ కోలీవుడ్లో చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ 85శాతం పూర్తి అయినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన ఎలాంటి వివరాలను ఇప్పటివరకు వెళ్లడించలేదు. తారాగణం ఎవరు ?సాంకేతిక వర్గం ఎవరు, నిర్మాత ఎవరు ? వంటి విషయాలను కానీ, చిత్ర టీజర్‌, ఆడియో వివరాలను గాని ప్రకటించలేదు. అలాంటిది ఒరెండ అంటూ చిత్ర టైటిల్‌ వీడియోను మాత్రమే ఇటీవల తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. అందులో తన కథ చిత్రాలకు సంబంధించిన కొన్ని సన్నివేశాలతో తన తాజా చిత్రానికి సంబంధించిన కొన్ని వర్కింగ్‌ దశ్యాలను పోస్ట్‌ చేస్తూ తన తదుపరి చిత్రం, త్వరలో వస్తున్నాయ్‌ అని పేర్కొన్నారు. వరెండా అంటే వస్తున్నాడా అని అర్థం ఇది బాగా వాడుకలో ఉన్న పదం కావడంతో ఇప్పుడు ఈ చిత్రంపై చిత్ర పరిశ్రమలోనూ, అటు ప్రేక్షకులను ఆసక్తి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement