తమిళసినిమా: ప్రముఖ నృత్య దర్శకుడు, కలైమణి అవార్డు గ్రహీత శ్రీధర్ మాస్టర్ బ్రహ్మాండ నృత్య ప్రదర్శన కార్యక్రమాన్ని శనివారం చైన్నెలో నిర్వహించారు. దీనికి వేల్స్ ప్రాంగణం వేదిక అయ్యింది. శ్రీధర్ ఏఆర్‌ఎస్ డాన్స్ అకాడమీ తరపున ఈయన నిర్వహించిన ఈ నృత్య ప్రదర్శనలో 1973 నుంచి 2026 వరకు చిత్ర రంగంలో పని చేస్తున్న నూతన 125 మంది నత్య దర్శకులు, తమిళనాడులో నృత్య పాఠశాలలను నిర్వహిస్తున్న 38, మంది నాట్య గురువులు పాల్గొన్నారు. దీని గురించి శ్రీధర్ మాస్టర్ మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంటూ తాను శిష్య బందానికి ఉత్సాహం కరిగించే విధంగానూ, తమిళనాడులోని నృత్య పాఠశాలలను నిర్వహిస్తున్న 38 మంది నాట్య గురువులను గౌరవించే విధంగా డాన్స్ డాన్ 2 పేరుతో ఈ డాన్స్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఇందులో పాల్గొన్న నృత్య దర్శకుల్లో ఎంజీఆర్, జయలలిత చిత్రాలకు పని చేసిన వారు కూడా ఉన్నారని చెప్పారు. ఇది తమతో పాటు ముందు తరం వారికి, భవిష్యత్తు తరాల వారికి ఒక అన్వేషణ లా ఈ నృత్య ప్రదర్శన ను నిర్వహించినట్లు చెప్పా రు. కాగా ఈయన తన కూతురుతో కలిసి పలు చైన్నె లో పలు నాట్య పాఠశాలలను నిర్వహిస్తుండడం గమనార్హం.


