అన్నానగర్ (చైన్నె): తిరువళ్లూరు జిల్లాలోని గుమ్మిడిపూండి–రెట్టంపేడు రహదారి పై ఆత్తుపాక్కం గ్రామం ఉంది. ఆర్యతమ్మన్ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద ఓ మహిళ మృతదేహం లభ్యమైందని గ్రామ పరిపాలనా అధికారి రమేష్ శనివారం ఉదయం గుమ్మిడిపూండి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీని తరువాత, పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించారు. ఆ సమయంలో, ఆలయ ద్వారం వద్ద పడి ఉన్న మృతదేహం ఉత్తర రాష్ట్రానికి చెందిన సుమారు 30 ఏళ్ల యువతిదని వెల్లడైంది. ఆమె ఎవరు? ఏ గ్రామానికి చెందినది అని తెలియదు. ఆమె గడ్డి తిన్నందున ఆమె నోరంతా గడ్డితో నిండి ఉంది. ఆకలితో గుడి గేటు వద్ద గడ్డి మొక్కలు తిన్నడం తో ఆ యువతి ఊపిరాడక చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. గత రెండు రోజులుగా ఆ మహిళ ఆ ప్రాంతంలో తిరుగుతోందని పోలీసుల విచారణలో వెల్లడైంది. పోలీసులు యువతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. గుమ్మిడిపూండి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చెక్కిన మట్టికుండ లభ్యం
సాక్షి, చైన్నె: తమిళనాడులోని ప్రసిద్ధ పురావస్తు క్షేత్రమైన కీళాడిలో జరుగుతున్న 11వ దశ తవ్వకాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన అరుదైన మట్టి కుండ ఒకటి వెలుగుచూసింది. ఈ ఎరట్రి మట్టి కుండపై చేప ఆకృతి స్పష్టంగా చెక్కబడి ఉండటం పురావస్తు శాస్త్రవేత్తలు పరిశోదననున వేగవంతం చేశారు. అడుగు వ్యాసం, అడుగు ఎత్తు కలిగిన ద్వివర్ణ ఎరుపు రంగు కుండ లభించింది. దీని పైభాగంలో చేప గుర్తు గీసి ఉంది. సంగం కాలం నాటి కీళాడి ప్రజల కళాత్మక సంప్రదాయం, సంకేతాత్మక సంప్రదాయాలు , హస్తకళా నైపుణ్యానికి ఈ ఆవిష్కరణ ఒక ముఖ్య ఆధారంగా నిలుస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు.
సాక్షి, చైన్నె: చైన్నెలోని ప్రముఖ సామాజిక వేదిక సూపర్ చైన్నె నిర్వహించిన సూపర్ చైన్నె అరాట్టై కార్యక్రమంలో ప్రముఖ తమిళ వక్త, రచయిత్రి, భారతీ భాస్కర్‌ను ఐకాన్ ఆఫ్ ది మంత్ పురస్కారంతో సత్కరించారు. నవిన్స్ మేనేజింగ్ డైరెక్టర్ విశ్వజిత్ కుమార్ చేతుల మీదుగా భారతీ భాస్కర్‌కు ఐకాన్ ఆఫ్ ది మంత్’ అవార్డును అందజేశారు. మాటలు ఆయుధం కంటే శక్తివంతమైనవి అని, ప్రసంగం అంటే బిగ్గరగా మాట్లాడటం కాదని, అవతలి వ్యక్తికి స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పడమేనని ఈసందర్భంగా భారతీ భాస్కర్ తెలిపారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో మాట్లాడటంతో పాటు సానుభూతితో వినడం కూడా ఎంతో ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. సూపర్ చైన్నె మేనేజింగ్ డైరెక్టర్ రంజీత్ రాథోడ్‌ను్ ఈసందర్భంగా ఇదే వేదికపై సూపర్ చైన్నె సమ్మర్ క్లిక్స్ 2026 ఫోటోగ్రఫీ పోటీల్లో గెలుపొందిన 10 మంది ఫొటోగ్రాఫర్లను కూడా సత్కరించారు.
కొరుక్కుపేట: తంజావూరు, తిరువారూరు, నాగపట్టణం, మైలాడుతురై వంటి డెల్టా జిల్లాల్లో కురువాయి సాగు ఆశాజనకంగా ఈ మనిద నేయ మక్కల్ కచ్చి నాయకుడు, ఎమ్మెల్యే జవహిరుల్లా ఓ ప్రకటనలో తెలిపారు. అయితే, పంట కోత వేగానికి అనుగుణంగా ప్రభుత్వ ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాలు తెరవకపోవడంతో, రైతులు తమ వరిని ఆరుబయట ఉంచడానికి మూటలను కుప్పలుగా వేయవలసి వస్తోంది. వర్షం పడితే, వరి తడిసి నాణ్యత క్షీణిస్తుంది, దీంతో వారి శ్రమ ఫలం పూర్తిగా వృథా అయ్యే ప్రమాదం ఉంది.ప్రస్తుతం, తంజావూరులో 257, తిరువారూరులో 189, మైలాడు సెక్టార్‌లో 144 , నాగపట్టణంలో 124 కేంద్రాలతో సహా మొత్తం 714 ప్రభుత్వ ప్రత్యక్ష వరి సేకరణ కేంద్రాలు పనిచేస్తున్నాయి. అయితే, కోతకు వస్తున్న వరి పరిమాణానికి ఈ సంఖ్య సరిపోవడం లేదని క్షేత్రస్థాయి రైతుల అభిప్రాయం. అనేక చోట్ల 5,000 నుండి 10,000 వరి బస్తాలు అమ్ముడుపోకుండా పడి ఉన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. అందువల్ల, తమిళనాడు ప్రభుత్వం తక్షణమే అదనపు ప్రభుత్వ వరి సేకరణ కేంద్రాలను తెరవాలి. ఇప్పటికే పనిచేస్తున్న కేంద్రాలలోతగినంత సిబ్బంది, తూకం యంత్రాలు, బస్తాలలో నింపే సౌకర్యాలు, నిల్వ గిడ్డంగులు , రవాణా సౌకర్యాలను తక్షణమే ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా, నిల్వ ఉండిపోయిన వరి కట్టలన్నింటినీ యుద్ధ ప్రాతిపదికన సేకరించి, ఆ మొత్తాన్ని ఆలస్యం చేయకుండా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.


