కింగ్‌ ఫిషర్‌ బీర్‌ కంపెనీలో అమ్మోనీయం గ్యాస్‌ లీకేజీ | - | Sakshi
Sakshi News home page

కింగ్‌ ఫిషర్‌ బీర్‌ కంపెనీలో అమ్మోనీయం గ్యాస్‌ లీకేజీ

Jul 26 2026 2:02 AM | Updated on Jul 26 2026 2:02 AM

నలుగురికి అస్వస్థత అరణ్‌వాయల్‌ సమీపంలో తీవ్ర కలకలం కంపెనీ నుంచి పరుగులు పెట్టిన ఉద్యోగులు సకాలంలో గుర్తించి లీకేజీని అరికట్టడంతో తప్పిన ప్రమాదం

తిరువళ్లూరు: ప్రముఖ బీర్‌ కంపెనీ (కింగ్‌ పిషర్‌ )లో స్వల్పంగా అమ్మోనీయం గ్యాస్‌ లీకేజీ కారణంగా నలుగురు ఉద్యోగులు అస్వస్థతకు గురయ్యారు. ఈ క్రమంలో పరిశ్రమ నుంచి భయంతో ఉద్యోగులు, కార్మికులు పరుగులు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే సంస్థ నిర్వాహకులు సకాలంలో లీకేజీని గుర్తించి అరికట్టడంతో పెనుప్రమాదం తప్పింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా అరణ్‌వాయల్‌ వద్ద యునైటెడ్‌ బ్రేవరీస్‌గా పిలువబడే కింగ్‌షిషర్‌ బీర్‌ కంపెనీ వుంది. ఈ పరిశ్రమలో బీర్‌ను బాటిల్స్‌లో నింపడానికి కార్బన్‌–డై ఆకై ్సడ్‌తో పాటు నైట్రోజన్‌ తదితర వాయువును ఉపయోగిస్తున్నారు. దీంతో పాటు కొన్ని ప్రీమియం బీర్‌లలో నురుగు, తాజాధనం కోల్పోకుండా ఉండడానికి, చిల్లింగ్‌ చేయడానికి అమ్మోనీయంను సైతం ఉపయోగిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం హఠాత్తుగా అమ్మోనీయం ట్యాంకర్‌ నుంచి స్వల్పంగా లీకేజీ ప్రారంభమైంది. దీంతో ట్యాంక్‌ ఆపరేటర్‌తో పాటు ముగ్గురు మహిళ కార్మికులకు వాంతులు రావడంతో పాటు అస్వస్థతకు గురై కిందపడడంతో తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన సంస్థ ఉద్యోగులు లీకేజీని అరికట్టి పెను ప్రమాదం జరగకుండా నివారించారు. కాగా అమ్మోనీయం లీకేజీ కారణంగా పరిశ్రమలో పని చేస్తున్న సిబ్బంది బయటకు భయంతో పరుగులు పెట్టడంతో ఉద్రిక్తత నెలకొంది. స్పృగ తప్పిన వారికి సంస్థలో వైద్యులు ప్రాధమిక చికిత్సను అందించారు. కాగా లీకేజీ కారణంగా దాదాపు గంట పాటు బీర్‌ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కాగా ఇటీవల కన్నిగైపేర్‌ వద్ద రొయ్యెల ప్రోసెసింగ్‌ సంస్థలో అమ్మోనీయం గ్యాస్‌ లీకేజీ కారణంగా 18 మంది మృతి చెందిన క్రమంలో శనివారం బీర్‌ కంపెనీలో లీకేజీ వ్యవహరం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement