వేలూరు: అనుమానంతో భార్య గొంతు కోసి హత్య చేసిన సంఘటన తిరుపత్తూరు జిల్లాలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే.. తిరుపత్తూరు జిల్లా ఆంబూరు తాలూకా పరిధిలోని ఉడయరాజ్‌పాళ్యం గ్రామానికి చెందిన బాబు, శ్రీదేవి(34) దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. బాబుకు భార్యపై అనుమానం ఉంది. దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. దీంతో శ్రీదేవి ముగ్గురు పిల్లలను తీసుకుని గత నెల తన అమ్మగారింటికి వెళ్లింది. అనంతరం పెద్దల చర్చలు జరపడంతో రెండు రోజుల క్రితం అత్తగారింటికి వచ్చింది. గురువారం రాత్రి తన పిల్లలతో కలిసి శ్రీదేవి ఇంటి మిద్దైపెన నిద్రపోయింది. శుక్రవారం ఉదయం 5 గంటల సమయంలో పిల్లలు మిద్దైపె నుంచి కిందకు దిగి వచ్చారు. ఆ సమయంలో తన తల్లి శ్రీదేవి తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండడాన్ని గుర్తించి కేకలు వేశారు. దీంతో చుట్టు పక్కల ఉన్న వారు ఆంబూ రు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు. బాబు పరారీలో ఉండడంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. దంపతుల మధ్య ఏర్పడిన ఘర్షణతోరనే బాబు తన భార్యను హత్య చేసినట్టు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. తల్లి మృతి చెందడం, తండ్రి పరారీ కావడంతో పిల్లలు కన్నీరు మున్నీరవుతున్నారు.


