కొరుక్కుపేట: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు నిర్దేశించుకుని వాటిని సాధించుకునేందుకు కసితో చదవాలని ఇందిరా గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఇందిరా రాజేంద్రన్ పిలుపునిచ్చారు. తెలుగు మహాజన సమాజం నిర్వహణలో కొనసాగుతున్న శ్రీ వేణుగోపాల్ విద్యాలయం 46వ వార్షికోత్సవాన్ని శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. దీనికి చైన్నె తేనాంపేట, కామరాజ్ అరంగం వేదికై ంది. పాఠశాల అధ్యక్షులు కె.అనిల్‌కుమార్ రెడ్డి, ఇందిరా రాజేంద్రన్, గౌరవ అతిథిగా ప్రీస్ట్ యూనివర్సిటీ ప్రెసిడెంట్ ప్రియదర్శిని రాజేంద్రన్ జ్యోతి ప్రజ్వలన చేశారు. పదవ తరగతి, ప్లస్ టూ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. అదేవిధంగా అనిల్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా విద్యార్థులకు వాచ్‌లను అందించి అభినందించారు. 25 సంవత్సరాలపైగా తెలుగు మహాజన సమాజానికి సేవలందించిన ఎం.విఎస్‌ఆర్ శర్మను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యక్షుడు కె.ఆనంద్ కుమార్ రెడ్డి, కోశాధికారి కె.రంగారెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ ఆర్.ఇలంగో, ప్రధానోపాధ్యాయురాలు వి.శీలా, కమిటీ సభ్యులు వెంకటరెడ్డి, తెలుగు సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


