త్వరలో వెండి తెరపైకి అప్పాకుట్టి | - | Sakshi
Sakshi News home page

త్వరలో వెండి తెరపైకి అప్పాకుట్టి

Jul 25 2026 12:17 AM | Updated on Jul 25 2026 12:17 AM

తమిళ సినిమా: మంచి వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని వరుసగా నటిస్తున్న నటుడు విజయ్‌ ఆంటోని. ఈయన సంగీత దర్శకుడిగా కెరీర్‌ను ప్రారంభించి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ఆ తర్వాత కథానాయకుడిగా అవతారమెత్తి,, ఆపై నిర్మాతగా మారి విజయాలను అందుకుంటున్నారు. అలా సంగీత దర్శకుడాగా కథానాయకుడిగా, నిర్మాతగా, ఎడిటర్‌గా రాణిస్తున్న ఈయన బిచ్చగాడు చిత్రంతో నటుడుగా స్టార్‌ అంతస్తుకు చేరుకున్నారు. ఇటీవల ఈయన దర్శకుడు శశి దర్శకత్వంలో విజయ్‌ ఆంటోనీ కథానాయకుడిగా నటించి, నిర్మించిన నూరుసామి చిత్రం ప్రేక్షకుల ఆదరణను పొందింది. తాజాగా విజయ్‌ ఆంటోని కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం అప్పా కుట్టి. నటి ప్రీతి అస్రారాణి నాయకి. ఇందులో బేబీ లిదన్బా, భగవతి పెరుమాళ్‌, హరిప్రియ, అరువి మదన్‌ కుమార్‌, చిత్రా లక్ష్మణన్‌, శ్రీజ రవి, వేట్టై ముత్తుకుమార్‌, జాన్సన్‌ దివాకర్‌, మురుగానందమ్‌, మూనార్‌ రమేష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. విజయ్‌ ఆంటోని సంగీతాన్ని, రాజీవ్‌ రాజేంద్రన్‌ ఛాయాగ్రహణంను అందించారు. ఇది తండ్రి కూతుళ్ల మధ్య అనుబంధాన్ని చాటే వైవిధ్య భరిత కథా చిత్రంగా యూనిట్‌ సభ్యులు పేర్కొన్నారు. ఎం మారన్‌ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రం కుటుంబ అనుబంధాలతో పాటు యాక్షన్‌ వంటి పలు కమర్షియల్‌ అంశాలు చోటుచేసుకుంటాయని దర్శకుడు పేర్కొన్నారు. ముఖ్యంగా తండ్రి కూతుళ్ల మధ్య హద్దులు లేని ప్రేమ, త్యాగం, పరస్పర అవగాహన వంటివి ముఖ్య అంశాలుగా రూపొందిస్తున్న కథా చిత్రం అప్పాకుట్టి అని తెలిపారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్ని కలిగించే ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుందని, త్వరలో తెరపైకి తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ ఇటీవల విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను తెచ్చుకుందని చెప్పారు. తాజాగా విజయ్‌ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా చిత్రం రెండో ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ విడుదల చేసినట్లు ఇది ప్రేక్షకుల్లో చిత్రంపై మరింత అంచనాలను రేకెత్తిస్తోందని దర్శకుడు పేర్కొన్నారు.

అప్పాకుట్టి చిత్రంలో బేబిలిదన్యాతో విజయ్‌ ఆంటోని

విజయ్‌ ఆంటోని పుట్టినరోజు

సందర్భంగా చిత్రం రెండో

పోస్టర్‌ విడుదల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement