బ్లాక్ చిత్రంలో
ఓ దృశ్యం
తమిళ సినిమా: ఐ అండ్ ఐ పోలీస్ పతాకంపై వై.వైర ప్రకాష్ నిర్మిస్తున్న చిత్రం బ్లాక్. దీనికి కథ, కథనం, మాటలు, ఛాయాగ్రహణం, దర్శకత్వం బాధ్యతలను ఎస్పీ.పొన్ శంకర్ నిర్వహిస్తున్నారు. కొట్టుక్కాళి, ఇడ్లీ కడై వంటి చిత్రాల్లో కీలక పాత్రలు పోషించిన దీహాన్, ధూమ్, క్రిష్, సర్ధార్ చిత్రాల ఫేమ్ బాలీవుడ్ నటి మిక్కీ మక్కీజా, అభినవ్ కోశాలి ప్రధాన పాత్రలు పోషించారు. ఇందులో బోజ్‌పురికి చెందిన శాంత ఆనంద్, బెంగాలీకి చెందిన పప్పూషా, కేరళ, కర్ణాటకకు చెందిన పలువురు ముఖ్యపాత్రలు పోషించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ముంబయి, గుజరాత్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, కశ్మీర్ తదితర ప్రాంతాల్లో చిత్ర షూటింగ్ పూర్తిచేసినట్లు చెప్పారు. పదేళ్ల కుర్రాడు దీహాన్ పెంపకంలో పెరుగుతాడని ఒకానొక పరిస్థితుల్లో అతను ఢిల్లీకి వెళ్తాడని చెప్పారు, అతను అక్కడ ఎటు వెళ్లాలో తెలియక దేశం మొత్తం తిరుగుతాడన్నారు అలా అనుకోకుండా తీవ్రవాదులతో కలిసి పయనించాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. అలా అతను పోలీసులకు పట్టుబడతాడన్నారు. అతను ఎందుకు ఢిల్లీ వెళ్లాడు, అతను నిజంగానే తీవ్రవాదిగా మారాడా? ఆ తరువాత ఏం జరిగింది అన్న పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందించిన చిత్రం బ్లాక్ అని చెప్పారు. దీనికి ఛాయాగ్రహణంను నువరదరాజన్, సంగీతాన్ని రాజా రవీంద్రన్ అందించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు దర్శకుడు తెలిపారు.


