తిరువళ్లూరు: ముఖ్యమంత్రి విభాగం, గ్రీవెన్స్‌డే, అగ్రి గ్రీవెన్స్‌డేకు వచ్చే వినతులను పరిష్కరించడంలో జిల్లా లాస్ట్ ర్యాంకులో ఉందని, వచ్చే 20 రోజు ల్లో అన్ని వినతులను పరిష్కరించి ర్యాంకును మెరుగు పరచాలని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కుమార్ అధికారులను ఆదేశించారు. ఆయన శుక్రవారం తిరువళ్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన వారికి సంక్షేమ పథఽకాలు, స్వయం ఉపాధి సంఽఘాలకు రుణాల పంపిణీ చేశారు. మంత్రి కుమార్ మాట్లాడుతూ ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలో కలెక్టర్ల సమా వేశం నిర్వహించినట్టు తెలిపారు. ఈ సందర్భంగా వినతుల పరిష్కారంపై వచ్చిన నివేదికను పరిశీలించగా జిల్లా చివరి స్థానంలో నిలిచిందన్నారు. ఇకపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రజలు ఇచ్చిన వినతులపై జవాబుదారీతనాన్ని ప్రదర్శించాలని సూచించారు. రానున్న 20 రోజుల్లో పెండింగ్ వినతులను పరిస్కరించాలని ఆదేశించారు. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై అధికారులు సమన్వయంతో పనిచే యాలని పేర్కొన్నారు. అనంతరం ఐదుగురు విక లాంగులకు కృత్రిక కాళ్లు, తదితర పరికరాలను అందజేశారు. 269 మందికి రూ.14.14 లక్షల విలువైన కుట్టుమిషన్‌లు, 85 స్వయం ఉపాధి సంఘాలకు రూ.15 కోట్ల విలువ చేసే రుణాల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మానిటరింగ్ ఐఏఎస్ అధికారి కార్తికేయన్, ఎమ్మెల్యేలు డాక్టర్ అరుణ్‌కు మార్, కుట్టి అలియాస్ ప్రకాశం, విజయకుమార్, రమేష్‌కుమార్, డాక్టర్ రవి, విజయప్రభు, ఎస్పీ సాయి ప్రణీత్, డీఆర్వో రాజ్‌కుమార్, ప్రాజెక్టు డైరెక్టర్ ఇందుబాల, సబ్‌కలెక్టర్లు అబ్దుల్, రఫీక్, ఆవడి కార్పొరేషన్ కమిషనర్ శరణ్య పాల్గొన్నారు.


