కొరుక్కుపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఏఎంఎంకే తరఫున మన్నార్గుడి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కామరాజ్ గెలుపొందారు. ఆ తర్వాత టీవీకేకి మద్దతు ఇచ్చారు. దీంతో ఆయనను ఏఎంఎంకే నుంచి బహిష్కరించారు. అసెంబ్లీలో ఆయన టీవీకే ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఏఎంఎంకే తరఫున గెలిచిన ఏకై క ఎమ్మెల్యే కామరాజ్ కావడంతో, ఫిరాయింపుల నిరోధక చట్టం ఆయనకు వర్తించలేదు. అయినప్పటికీ ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ ఏఎంఎంకే అధికార ప్రతినిధి కరికాలన్ స్పీకర్ లేఖను సమర్పించారు.
తిరుత్తణి: రాత్రి సమయంలో బస్సులు నడపకపోవడంతో ఆగ్రహించిన ప్రయాణికులు రాస్తారోకో చేపట్టారు. తిరుత్తణి కొత్త బస్టాండు నుంచి అరక్కోణం, కాంచీపురానికి వెళ్లే బస్సుల కోసం గురువారం రాత్రి బస్సులు రాకపోవడంతో గంటల తరబడి వేచివుండిన ప్రయాణికులు ఆగ్రహం చెంది రాస్తారోకో చేపట్టారు. పోలీసులు సంఘటన ప్రాంతం చేరుకుని ప్రయాణికులతో చర్చలు జరిపారు. అరక్కోణం రోడ్డు మార్గంలో ఆక్రమణలు తొలగింపుతో కాంచీపురం మార్గంలో వెళ్లు బస్సులను బైపాస్ రోడ్డు మార్గంలో మళ్లించారని, దీంతో కొత్త బస్టాండుకు బస్సులు రావడం లేదని పోలీసులు తెలిపారు. ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్ట్యా కొత్త బస్టాండుకు బస్సులు నడిపి ప్రయాణిలను తరలించారు. రాత్రి సమయంలో ప్రయాణికుల రాస్తారోకోతో కలకలం రేపింది.


