కాకంగళ్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి..! | - | Sakshi
Sakshi News home page

కాకంగళ్‌ చిత్ర షూటింగ్‌ పూర్తి..!

Jul 24 2026 2:03 AM | Updated on Jul 24 2026 2:03 AM

తమిళసినిమా: కాక్కా ముట్టై,కుట్రమే దండనై చిత్రాల కథా రచయిత ఆనంద్‌ అన్నామలై దర్శకుడిగా అవతారమెత్తి రూపొందిస్తున్న చిత్రం కాకంగళ్‌. మాయవరం పిక్చర్స్‌ పతాకంపై ఈయన కథ, కథనం ,సంభాషణలు, కూర్పు, దర్శకత్వం, నిర్మాత బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రంలో కిషోర్‌ యోగి బాబు, విధార్ధ్‌, లిజోమోల్‌ జోష్‌, గురు సోమ సుందరం తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్‌ బుధవారంతో పూర్తి అయిందని దర్శక నిర్మాత ఆనంద్‌ అన్నామలై మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ ఇది మానవ అనుబంధాలను, ఆధ్యాత్మిక అన్వేషణ వంటి వైవిద్య భరిత కథాంశంతో రూపొందిస్తున్న చిత్రం అని చెప్పారు. చిత్ర షూటింగ్‌ పూర్తి అయిందని, కాగా బుధవారం నటుడు యోగిబాబు పుట్టిన రోజు కూడా కావడంతో రెండు వేడుకలను పెట్టింపు ఉత్సాహంతో కేక్‌ కట్‌ చేసి జరుపుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం డబ్బింగ్‌, సౌండ్‌, డిజైనింగ్‌, నేపథ్య సంగీతం , వీఎఫ్‌ ఎక్స్‌, డీఐ తదితర నిర్మాణాంత కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. తమిళ సినిమాల్లో వైవిద్య భరిత కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానిఠకి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలను త్వరలోనే ప్రారంభించినట్లు దర్శక నిర్మాత ఆనంద్‌ అన్నామలై పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement