సాక్షి, చైన్నె : దక్షిణ ఆసియాలో ఏడాదిలోనే 300కి పైగా ఎవాల్యూషన్ మెడియల్–పివట్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సలు పూర్తి చేసి చైన్నె సర్జన్ ఘనత సాధించారు. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స రంగంలో కేవలం నొప్పులను నివారించడమే కాకుండా, మోకాలి సహజమైన కదలికలను పునరుద్ధరించడం అత్యంత కీలకమైన అంశంగా మారింది. ఈ కొత్త విధానంలో చైన్నె పార్వతి హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ వెట్రి కుమార్ సరికొత్త మైలురాయిని అధిగమించారు. ఎవాల్యూషన్ మెడియల్–పివట్ నీ సిస్టమ్ ఉపయోగించి ఏడాది కంటే తక్కువ సమయంలోనే 300కి పైగా టోటల్ నీ రిప్లేస్‌మెంట్ శస్త్రచికిత్సలు పూర్తి చేసిన దక్షిణ ఆసియాలోనే ఘనత సాధించిన సర్జన్‌గా ఆయన నిలిచారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ’ఎవాల్యూషన్ ట్రూ మెడియల్–పివట్ సాంకేతికత మోకాలికి సహజమైన స్థిరత్వాన్ని , కదలికలను ఇస్తుందని వివరించారు. ఈ శస్త్రచికిత్స చేయించుకున్న రోగులు తాము మోకాలి మార్పిడి చేయించుకున్నామనే విషయాన్నే మరిచిపోయేలా సాధారణ జీవితానికి త్వరగా తిరిగి రాగలుగుతున్నారన్నారు. ఆధునిక మోకాలి మార్పిడి అనేది కేవలం నొప్పిని తగ్గించడానికే పరిమితం కాదని, . ప్రతి ఒక్కరి మోకాలి నిర్మాణం ప్రత్యేకమైనదిగా వివరించారు. ఆ ప్రత్యేకతను గౌరవిస్తూ చికిత్స అందిస్తే రోగికి అత్యంత సహజమైన కదలికలు లభిస్తాయనానరు. ఈ 300 శస్త్రచికిత్సలు కేవ లం సంఖ్య మాత్రమే కాదు, 300 మంది జీవితాల్లో వచ్చిన మార్పు. సరైన క్లినికల్ విధానం , ఆవిష్కరణలు మోకాలి సహజ పనితీరును ఎలా పునరుద్ధరించగలవో డాక్టర్ వెట్రి నిరూపించారని ఈసందర్భంగా మైక్రో పోర్ట్ ఆర్థోపెడిక్స్ సీనియర్ జనర ల్ మేనేజర్ డాక్టర్ ముకేష్ పర్మార్‌అభినందించారు.


