తమిళసినిమా: క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన సక్సెస్‌ఫుల్ చిత్రాలలో చైన్నె 28 ఒకటి. వెంకట్ ప్రభు దర్శకత్వ వహించిన ఇందులో నటుడు శివ, జయ్, నితిన్ సత్య, విజయ్ వసంత్ , అరవింద్ ఆకాష్, ఇళంగో రవి తదితరులు ప్రధాని పాత్రలు పోషించారు. 2007లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తర్వాత మాసు ఎంగిరా మాచలామణి, బిరియాని వంటి చిత్రాలను చేసిన వెంకట్ ప్రభుకు ఆ చిత్రాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. దీంతో మళ్లీ తనకు మంచి విజయాన్ని సాధించిన చైన్నె 28 చిత్రానికి పార్ట్ 2 ఎక్కించారు. 2016లో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత శింబు హీరోగా మానాడు వంటి హిట్ చిత్రాన్ని ఇచ్చిన వెంకట ప్రభు ఈమధ్య విజయ్ హీరోగా గోట్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇది కూడా ఆశించిన విజయాన్ని చేరుకోలేకపోయింది. ఆ తర్వాత శివ కార్తికేయన్ హీరోగా రూపొందించిన మదరాసి చిత్రం ఓకే అనిపించుకుంది. తదుపరి నటుడు అజిత్ హీరోగా చిత్రం చేయనున్నారనే ప్రచారం జోరుగా సాగింది. అయితే అది ఏమైందో గానీ, తాజాగా తనకు కలిసి వచ్చిన క్రికెట్ క్రీడ నేపథ్యంలో చైన్నె 28 చిత్రానికి మూడవ భాగాన్ని తెరకెక్కించడానికి వెంకట్ ప్రభు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన కథా చర్చలను ఇటీవల మలేషియాలో తన టీమ్‌తో కలిసి నిర్వహించి పూర్తి చేసిన వెంకట్ ప్రభు ఇప్పుడు చెత్త షూటింగ్‌ను థాయిలాండ్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తాజా సమాచారం. కాగా ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.


