ఒడిశా నుంచి గంజా తరలిస్తున్న నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఒడిశా నుంచి గంజా తరలిస్తున్న నలుగురి అరెస్ట్‌

Jul 24 2026 1:51 AM | Updated on Jul 24 2026 1:51 AM

వేలూరు: ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు గంజా తరలించి విక్రయం చేస్తున్న నలుగురిని రైల్వే పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఒడిశా రాష్ట్రం నుంచి రైలు మార్గంలో గంజా తరలిస్తున్నట్లు రైల్వే పోలీసులకు రహస్య సమాచారం వచ్చింది. దీంతో కాట్పాడి రైల్వే పోలీసులు ఒడిశా రాష్ట్రం నుంచి తమిళనాడుకు వస్తున్న ఎక్స్‌ప్రెస్‌ రైలులో అకస్మికంగా తనిఖీలు చేశారు. ఆ సమయంలో రైల్వే పోలీసుల తనిఖీలను చేసి నలుగురు యువకులు ట్రావెల్‌ బ్యాగులతో వాలాజ రైల్యే స్టేషన్‌లో దిగి నడిచి వెళ్తుండగా రైల్వే పోలీసులు వారిని నిలిని బ్యాగులను తనిఖీ చేయగా అందులో గంజాయి ఉన్నట్లు గుర్తించారు. అనంతరం రైల్వే పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెల్లి పరిశీలించగా అందులో మొత్తం 28 కిలోల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఒడిశా రాష్ట్రంలోని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. అదే విధంగా వీరు తరచూ ఒడిసా రాష్ట్రం నుంచి గంజాయిను తీసుకొచ్చి తమిళనాడులోని పలు ప్రాంతాల్లో విక్రయం చేస్తున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement